ఏపీలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతంగా కొనసాగేలా సబ్ డిస్ట్రిక్ట్లు ఏర్పాటు కానున్నాయి.కొన్ని జిల్లాల్లో కొత్తగా సబ్ డిస్ట్రిక్ట్లు ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ జారీ అయింది.
రీసర్వే అనంతరం పౌర సేవలను అందించడంలో భాగంగా సబ్ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.ఇందులో భాగంగా అనకాపల్లి, చిత్తూరు, కృష్ణాతో పాటు మన్యం జిల్లాల్లో సబ్ డిస్ట్రిక్ట్లు ఏర్పాటు చేయనున్నారు.
అదేవిధంగా నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, కడప, విజయనగరం, కోనసీమ, ఏలూరు, కర్నూలు మరియూ తూర్పు గోదావరి జిల్లాల్లో సబ్ డిస్ట్రిక్ట్లు ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌లలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కూడా ఏర్పాటు కానున్నాయి.
ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ లోని గ్రామాలు కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌ల పరిధిలోకి వస్తాయని వెల్లడించారు.కాగా రిజిస్ట్రేషన్ల సేవల కోసం గ్రామ సచివాలయాల పరిధిని పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ అయింది.
ఈ క్రమంలో తక్షణమే సదరు నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు.