చిలికా సరస్సు వద్దకు ఏటా శీతాకాలంలో విదేశాల నుంచి ఎన్నో పక్షులు వలస వస్తుంటాయి.మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పక్షులు కూడా ఇక్కడికి విచ్చేస్తుంటాయి.
రంగురంగులు ఉండే ఈ పక్షులు తమ కిలకిలారావాలతో చిలికా సరస్సు వద్ద అత్యంత అందమైన దృశ్యాన్ని క్రియేట్ చేస్తుంటాయి.ఈసారి కూడా ఈ శీతాకాలంలో భారీగా చిలికా సరస్సు వద్దకు పక్షులు వచ్చాయి.
దీనికి సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఆ వలస పక్షులను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఒడిషాలో ఉండే ఈ చిలికా లేక్ ఆకాశం రంగులో చాలా బ్లూగా ఉంటూ ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.దానికి తోడు శీతాకాలంలో ఇక్కడికి వచ్చే పక్షులు, వాటి శబ్దాలు అందర్నీ కట్టిపడేస్తుంటాయి.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి షేర్ చేసిన ఈ వీడియోలో చిలికా సరస్సు మీదుగా వలస పక్షులు విహరిస్తూ ఉండటం చూడవచ్చు.అవి ఎగురుతూ ఉంటే వాటిని స్లో మోషన్ లో రికార్డ్ చేశారు.
ఈ వీడియో అత్యద్భుతంగా కనిపించింది.వలస పక్షుల సీజన్ మొదలైందని ఈ వీడియోకు అధికారి ఒక క్యాప్షన్ జోడించారు.
సాధారణంగా నవంబర్ రెండవ వారంలో పక్షుల సంఖ్య ఎక్కువ అవుతుంది.సరిగ్గా అదే సమయంలో వీడియో తీశారు.షేర్ చేసిన సమయం నుంచి ఈ వీడియోకి ఇప్పటికే 10,000 కు పైగా వ్యూస్ వచ్చాయి.దీన్ని చూసిన నెటిజన్లు ప్రకృతి అందాలకు మించింది ఏదీ లేదని కామెంట్లు చేస్తున్నారు.
ఈ బ్యూటిఫుల్ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.