Kantara movie Rishabh Shetty : కాంతార సీక్వెల్... అసలు విషయం బయట పెట్టిన రిషబ్ శెట్టి?

కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన కాంతార సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే.ఇలా అన్ని భాషలలో భారీ కలెక్షన్లను రాబడుతూ కలెక్షన్లు సునామీ సృష్టిస్తున్న కాంతర సినిమాకు సీక్వెల్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

 Kantara Sequel Rishabh Shetty Revealed The Real Thing , Kantara Sequel ,rishabh-TeluguStop.com

ఈ సినిమాకు తప్పనిసరిగా సీక్వెల్ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా డైరెక్టర్ రిషబ్ శెట్టి ఈ సినిమా సీక్వెల్ గురించి అసలు విషయం వెల్లడించారు.

ఇలా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ ప్రస్తుతం తాను కాంతార సినిమా సీక్వెల్ పై స్పందించలేను.ప్రస్తుతానికి తమ దృష్టి మొత్తం కాంతార సినిమా పైనే ఉందని, సీక్వెల్ గురించి తర్వాత ఆలోచిస్తామని తెలిపారు.

ఈ సినిమాకు ఉపకథలు చాలా ఉన్నాయి వాటిలో ఒకదానిని సీక్వెల్ సినిమాకు ఆప్షన్ గా ఎన్నుకుంటాము.ఇక ఈ సినిమాలో భూతకోలం గురించి కూడా ఈయన మాట్లాడారు.

Telugu Exorcism, Kantara, Kantara Sequel, Rishabh Shetty-Movie

భూత కోలాన్ని మేము దీన్ని దైవకోల అంటాం.అది ఆడేటప్పుడు పలికేది కేవలం ఒక శబ్దం మాత్రమే కాదు.అది ఒక ప్రకటన, ప్రతిపాదనలాంటిది.అదొక తీర్పు.భావోద్వేగం.దీవెన.

తాను చిన్నప్పటి నుంచి ఇలా దైవకోలం చూస్తూ పెరిగానని, ఈ ప్రకృతిలో ఉండే శక్తి మొత్తం ఒక మనిషిలోకి వస్తే ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నమే ఈ కాంతార సినిమా అంటూ ఈ సందర్భంగా రిషబ్ శెట్టి కాంతార సినిమా సీక్వెల్ గురించి వెల్లడించారు.డైరెక్టర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే తప్పకుండా ఈ సినిమాకు సీక్వల్ ఉంటుందని అయితే కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube