రొమ్ము క్యాన్సర్ ను అడ్డుకునే అహారం

ప్రతీ ఎడాది లక్షల్లో మహిళలు రొమ్ము క్యాన్సర్‌ బారిన పడుతున్నారు.బ్రెస్ట్ క్యాన్సర్ వలన మరణాల శాతం కూడా ప్రతీ ఏడాది పెరిగిపోతోంది.

ఇలాంటి సమయంలో మహిళలు ఎంతో జాగ్రత్తగా, ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాల్సిన ఆవశక్యత ఉంది.ఈ బ్రెస్ట్ క్యాన్సర్ మీద పోరాటం ఇంట్లో కూడా చేయాలి.

బ్రెస్ట్ క్యాన్సర్ ని రాకుండా అడ్డుకోవచ్చు, వస్తే పోరాడవచ్చు.అందుకు ఉపయోగపడే ఆహారం ఏంటో ఇప్పుడు చూద్దాం.

* టమాటలో లైకోపిన్ అనే ఎంజైమ్ ఉంటుంది.ఇది ప్రభావంతమైన యాంటి యాక్సిడెంటుగా పనిచేస్తుంది.

Advertisement

క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ని నివారించేందుకు, అబ్నార్మల్ సెల్స్ పెరుగుదలను అడ్డుకునేందుకు లైకోపిన్ సహాయం చేస్తుంది.* దానిమ్మ సకల రోగాలకు మందుగా చెబుతారు.

దానిమ్మలో ఉండే యూరోలిథిన్ బి హార్మోన్ల సమతుల్యాన్ని కాపాడుతూ, బ్రెస్ట్ క్యాన్సర్‌ ని అడ్డుకుంటుంది.* క్యాన్సర్ కు సంబంధించిన ఫ్రీరాడికల్స్ ను నివారించాలంటే పసుపు ఒక మంచి సాధనం.

ఇందులో ఉండే యాంటిఆక్సిడెంట్స్ రక్షణకవచంలా పనిచేస్తుంది.* సాల్మన్‌ ఫిష్ వలన అనేక లాభాలున్నాయి.

ఇందులో లభించే ఒమేగా 3 ఫ్యాటి ఆసిడ్స్ క్యాన్సర్‌ సెల్స్ ని విస్తరించకుండా అడ్డుకుంటాయి.అలాగే క్యాన్సర్ నిరోధానికి కూడా సాల్మాన్ ఫిష్ ఉపయోగపడుతుంది.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
ఒలంపిక్ పతకాలలో నిజంగా బంగారం ఉంటుందా..? లేదా..?

* ఆకుకూరలతో ఇటు బ్రెస్ట్ క్యాన్సర్ తో పాటు ఓరల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్‌ తో పోరాడవచ్చు.ఆకుకూరల్లో ఫ్రీరాడికల్స్ తో పోరాడే శక్తి ఉంటుంది.

Advertisement

* బ్రొకోలి బ్రెస్ట్ క్యాన్సర్ తో పాటు ప్రొస్టేటు క్యాన్సర్ పై పనిచేస్తుంది.ఇందులో లభించే ఐడోల్ 3 రొమ్ము క్యాన్సర్ పై మాత్రమే కాదు, బ్రేయిన్ ట్యూమర్ పై కూడా పనిచేస్తుంది.

* బ్లూ బెర్రిస్ లో యాంటిఆక్సిడెంట్స్, ఎలాజిక్ ఆసిడ్ మరియు క్యాన్సర్జెనిక్ లక్షణాలు ఉంటాయి.ఇందులో ఫైటో కెమికలస్ కూడా దొరుకుతుంది.

బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ మీద దాడికి బ్లూ బెర్రిస్ బాగా ఉపయోగపడతాయి.

తాజా వార్తలు