Hair Fall : రోజు తలస్నానం చేయడం వల్ల జుట్టు అధికంగా ఊడుతుందా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!

చాలా మంది వారానికి ఒకటి లేదా రెండు సార్లు తల స్నానం చేస్తుంటారు.కానీ కొందరికి మాత్రం నిత్యం తల స్నానం చేసే అలవాటు ఉంటుంది.

ఈ అలవాటు కారణంగా హెయిర్ ఫాల్( Hair fall ) అనేది చాలా అధికంగా ఉంటుంది.జుట్టు రాలిపోతుంది అంటే ఏదో తెలియని ఆందోళన వెంటాడుతూ ఉంటుంది.

దీంతో జుట్టు రాలడాన్ని అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే అస్స‌లు వ‌ర్రీ అవ్వ‌కండి.నిజానికి కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టడానికి చాలా ఎఫెక్టివ్ గా హెల్ప్ చేస్తాయి.

అందులో ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ( Home Remedy ) కూడా ఒకటి.ఈ రెమెడీని పాటించారంటే సులభంగా జుట్టు రాలడాన్ని అడ్డుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera Gel ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆవ నూనె, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ విధంగా చేశారంటే జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అవుతుంది.ఆవ నూనె, అలోవెరా జెల్ మరియు తేనె( Honey )లో ఉండే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టును మూలాల నుంచి బలోపేతం చేస్తాయి.కురులకు చక్కని పోషణ అందిస్తాయి.

ఈ సింపుల్ రెమెడీని పాటించారంటే హెయిర్ ఫాల్ సమస్యకు బై బై చెప్పవచ్చు.పైగా కొందరు జుట్టు చిట్లిపోతుంది, విరిగిపోతుందని బాధపడుతుంటారు.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

అలాంటి వారికి కూడా ఈ న్యాచురల్ రెమెడీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

Advertisement

తాజా వార్తలు