అన్నం గంజిలో ఇవి కలిపి జుట్టుకు రాస్తే మీ హెయిర్ డబుల్ అవుతుంది..!

సాధారణంగా అన్నం వండిన తర్వాత వచ్చే గంజిని( Porridge ) చాలా మంది బయట పార‌బోస్తుంటారు.గంజి ఎందుకు పనికిరాదని భావిస్తుంటారు.

కానీ ఒకప్పుడు పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా గంజి తాగేవారు.ఆరోగ్యపరంగా గంజి అపారమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది.

అలాగే కేశ సంరక్షణకు సైతం గంజి ఉపయోగపడుతుంది.ముఖ్యంగా గంజిలో ఇప్పుడు చెప్పబోయే పదార్థాలను కలిపి జుట్టుకు రాస్తే మీరు ఊహించని ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అర కప్పు అన్నం గంజి వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు రెండు టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగు ( curd )వేసుకొని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ విధంగా చేశారంటే అదిరిపోయే లాభాలు పొందవచ్చు.ముఖ్యంగా ఈ సింపుల్ మాస్క్ వల్ల హెయిర్ రూట్స్ సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.జుట్టు రాల‌డం కంట్రోల్ అవుతుంది.

అదే సమయంలో జుట్టు పెరుగుదల ఇంప్రూవ్ అవుతుంది.కొత్త జుట్టు రావడం స్టార్ట్ అవుతుంది.

కొద్ది రోజుల్లోనే మీ హెయిర్ డబుల్ అవుతుంది.

వరలక్ష్మి ఫస్ట్ లవ్ నేను కాదు... సంచలన వ్యాఖ్యలు చేసిన నికోలయ్?
బంగ్లాదేశ్ లో 2 సార్లు రిలీజయి 5 భాష‌ల్లో 6 సార్లు రిమేక్ చేయ‌బ‌డ్డ తెలుగు సినిమా

అన్నం గంజి, అలోవెర జెల్‌, నిమ్మ‌ర‌సం( lemon juice ) మ‌రియు పెరుగులో ఉండే ప‌లు పోష‌కాలు జుట్టును ఆరోగ్యంగా మారుస్తాయి.జుట్టు యొక్క పీహెచ్‌ని పునరుద్ధరిస్తాయి మరియు సమతుల్యం చేస్తాయి.కురుల‌ను సిల్కీగా షైనీగా మారుస్తాయి.

Advertisement

అంతేకాదు ఈ సింపుల్ మాస్క్ వేసుకోవ‌డం వ‌ల్ల జుట్టు చిట్లడం తగ్గుతుంది.చుండ్రు సమస్యకు సైతం బై బై చెప్పవచ్చు.

కాబట్టి ఆరోగ్యమైన ఒత్తైన జుట్టును కోరుకునే వారు తప్పకుండా పైన చెప్పిన రెమెడీని పాటించండి.

తాజా వార్తలు