ముడతల్లేని యవ్వనమైన చర్మం కోసం ఈ ఇంటి చిట్కాను ఫాలో అవ్వండి!

వయసు పైబడే కొద్ది ముఖ కండరాలు వదులుగా మారిపోతాయి.దాంతో చర్మం సాగటం, ముడతలు వంటి వృద్ధాప్య లక్షణాలు కొట్టొచ్చినట్లు కనపడతాయి.

అయితే కొందరు మాత్రం ఏజ్ పెరిగినా కూడా చాలా యంగ్ లుక్ తో అట్రాక్ట్ చేస్తూ ఉంటారు.ముఖంపై ఒక్క ముడత కూడా కనిపించదు.

అటువంటి స్కిన్ ను మీరు కూడా కోరుకుంటున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాను తప్పకుండా ఫాలో అవ్వండి.ముందుగా బాగా పడిన ఒక అరటిపండు( banana ) తీసుకుని పీల్ తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటిపండు స్లైసెస్ వేసుకోవాలి.అలాగే పావు కప్పు ఆవు పాలు( Cows milk ) లేదా కొబ్బరి పాలు ( Coconut milk )వేసుకుని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ ( Coffee powder )మరియు వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Sweet almond oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు ఏదైనా బ్ర‌ష్ సహాయంతో అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో వేసుకున్న ప్యాక్ ను తొలగించాలి.రెండు రోజులకు ఒకసారి ఈ బనానా కాఫీ మాస్క్ ను వేసుకోవడం వల్ల అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

ముఖ్యంగా ఈ మాస్క్ చర్మాన్ని టైట్ గా మారుస్తుంది.ముడతలను తొలగిస్తుంది.యవ్వనమైన మెరిసే చర్మాన్ని అందిస్తుంది.

అలాగే ఈ బనానా మాస్క్ ను వేసుకోవడం వల్ల ముఖ చర్మం కాంతివంతంగా మారుతుంది.డార్క్ స్పాట్స్ మరియు పిగ్మెంటేషన్ వంటి సమస్యలు ఉంటే వాటి నుంచి విముక్తి లభిస్తుంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

కాబట్టి వయసు పెరిగినా కూడా ముడతలు లేని యవ్వనమైన చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న బనానా కాఫీ మాస్క్ ను ప్రయత్నించండి.అందంగా మెరిసిపోండి.

Advertisement

తాజా వార్తలు