దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!

మన మొత్తం ఆరోగ్యంలో దంతాలు కూడా కీలక పాత్రను పోషిస్తాయి.ఎలాంటి ఆహారం తినాలన్నా దంతాలు దృఢంగా ఉండడం ఎంతో అవసరం.

అందుకే దంతాల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.అయితే దృఢమైన, తెల్లటి దంతాలను పొందడానికి కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడుతాయి.

ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె( coconut oil ) రెండు మూడు చుక్కలు పెప్పర్ మెంట్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఉపయోగించి రోజు పళ్ళు తోముకోవాలి.ఈ విధంగా చేయడం వల్ల దంతాలపై పసుపు మరకలు పోతాయి.

Advertisement

దంతక్షయానికి దూరంగా ఉండవచ్చు.మరియు దంతాలు తెల్లగా సైతం మెరుస్తాయి.

అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో అర టీ స్పూన్ తులసి ఆకుల పొడి, చిటికెడు లవంగాల పొడి( Clove powder ) మరియు వాటర్ వేసుకుని కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని యూజ్ చేసి బ్రష్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా దంతాలు తెల్లగా మారతాయి.

దృఢంగా తయారవుతాయి.మరియు తులసి, లవంగాల్లో ఉండే పోషకాలు, ఔష‌ధ గుణాలు చిగుళ్లను గట్టిగా మారుస్తాయి.

ప్రమాదకరమైన బ్యాక్టీరియా, టాక్సిన్లను బయటకు పంపి నోటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

వైరల్ వీడియో : మహిళ పైకి దూసుకెళ్లిన పాము.. చివరకు..
ఒత్తిడిని చిత్తు చేసే లెమ‌న్ ఆయిల్‌..ఎలాగంటే?

ఇకపోతే దంతాల ఎనామెల్‌ను బలపరిచేందుకు ప్రత్యేకంగా ఉపయోగపడేది ప్రోటీన్.కాబట్టి ప్రోటీన్ కోసం పాలు, పెరుగు, జున్ను మరియు ఇతర పాల ఉత్పత్తుల‌ను ఆహారంలో భాగం చేసుకోండి.అలాగే దృఢమైన ఆరోగ్యమైన తెల్లటి దంతాల కోసం సెలెరీ, క్యారెట్లు, ఇతర క్రంచీ కూరగాయలు, పాలకూర, బచ్చలి కూర, తాజా పండ్లు తీసుకోండి.

Advertisement

వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.అవి చిగుళ్ళు మరియు ఇతర కణజాలాలను సెల్ డ్యామేజ్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంలో సహాయపడతాయి.దంతాల ఆరోగ్యానికి అండంగా నిలుస్తాయి.

తాజా వార్తలు