ఈ ఇంటి చిట్కాలతో అదిరే అందం మీ సొంతం!

అందంగా, కాంతివంతంగా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.అందుకోసం క్రీమ్, సీరం, మాయిశ్చరైజర్ ఇలా రకరకాల చర్మ ఉత్పత్తులను వాడుతుంటారు.

నెలకు ఒకసారి ఫేషియల్ చేయించుకుంటారు.అయితే వాటి వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అన్నది పక్కన పెడితే.

ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ఇంటి చిట్కాలు మాత్రం మీ అందాన్ని పెంచడంలో అద్భుతంగా తోడ్పడతాయి.అనేక చర్మ సమస్యలకు అడ్డుకట్ట వేస్తాయి.

మరి ఇంతకీ ఆ ఇంటి చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

సాధారణంగా చాలా మందిని కలవరపెట్టే చర్మ సమస్యల్లో మొటిమలు ముందు వరుసలో ఉంటాయి.అయితే మొటిమలతో బాధపడుతున్న వారు అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి( Cinnamon Powder)కి, పావు టీ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి చర్మంపై అప్లై చేసుకోవాలి.20 నిమిషాల అనంతరం వాటర్ తో కడిగేయాలి.ఇలా రెగ్యులర్ గా చేస్తే ముఖంపై ఒక్క మొటిమ కూడా ఉండదు.

మొటిమలు తాలూకు మచ్చలు కూడా మాయమవుతాయి.అలాగే స్కిన్ వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ కోసం ఆరాటపడేవారు వన్ టేబుల్ స్పూన్ చందనం పొడిలో మూడు టేబుల్ స్పూన్లు టమాటో ప్యూరీ, రెండు టేబుల్ స్పూన్లు పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

మీ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసి పూర్తిగా ఆరిన తర్వాత కడిగేయాలి.రెండు రోజులకు ఒకసారి ఈ విధంగా చేస్తే చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.

యంగ్ లుక్ కోసం ఒక ఎగ్ వైట్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.వారానికి రెండుసార్లు ఈ విధంగా చేయడం వల్ల స్కిన్ ఏజింగ్‌ ఆలస్యం అవుతుంది.

రవితేజ కుర్ర హీరోయిన్లతో డ్యూయెట్ పాడితే తప్పా.. నెటిజన్ల షాకింగ్ కామెంట్స్ వైరల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 5, బుధవారం, 2021

సాగిన చర్మం టైట్ గా మారుతుంది.వయసు పైబడిన యవ్వనంగా కనపడతారు.

Advertisement

ఇక టాన్ మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడానికి వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్ లో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు బాగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.

ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.తద్వారా చర్మ రంధ్రాల్లో మురికి మృతకణాలు తొలగిపోతాయి.

టాన్ రిమూవ్ అవుతుంది.చర్మం ఆరోగ్యంగా మారుతుంది.

తాజా వార్తలు