అమెరికన్ కు కోట్లు తెచ్చిపెట్టిన పెంపుడు కుక్క...

మనం ఎవరి నుండైనా లాభం పొందితే వారికి కేవలం కృతజ్ఞతలతోనే సరిపెట్టం మన సంతృప్తి కోసం ఎంతో కొంత ఇవ్వడమే, ఏదో ఒక వస్తువు ఇవ్వడమో చేస్తాం.అది కూడా ఎదుటివారు చేసిన సాయం బట్టి ఉంటుంది.

 Florida Man Credits Pregnant Dog For $2m Lottery Win,america,florida, Pet Dog, Lottery Ticket,luck, Ivy,pregnant Dog-TeluguStop.com

అయితే చాలా మంది ఒకరి నుంచీ సాయం పొందిన తరువాత ఎవరో తెలియనట్టుగా, తిరిగి వాళ్లకు సాయం చేయాల్సి వస్తుందో అన్నట్టుగా తప్పించుకు తిరుగుతారు.అయితే అమెరికాలో ఓ వ్యక్తి తానూ పెంచుకుంటున్న పెంపుడు కుక్క కారణంగా భారీ లాటరీ గెలుచుకోవడంతో ఉబ్బితబ్బిబ్బై పోయాడు.

అసలు కుక్కకు లాటరీ టిక్కెట్టు కు సంభంధం ఏంటి అనే వివరాలలోకి వెళ్తే.

 Florida Man Credits Pregnant Dog For $2M Lottery Win,America,Florida, Pet Dog, Lottery Ticket,Luck, Ivy,Pregnant Dog-అమెరికన్ కు కోట్లు తెచ్చిపెట్టిన పెంపుడు కుక్క#8230;-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన లింటన్ అనే వ్యక్తి ఓ కుక్కను పెంచుకుంటున్నాడు.

ఆ కుక్కను ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు.తమ కుటుంబంలో ఒకరిగా పెరుగుతున్న దానికి ఐవి అనే పేరు పెట్టారు.

ఎంతో గారాబంగా పెరిగిన దానికి పిల్లలు కూడా పుట్టనున్నాయని తెలుయడంతో లింటన్ ఆనందానికి అవధులు లేవు అయితే అనుకోకుండా ఐవి కి జబ్బు చేసిందని తెలియడంతో హడావిడిగా ఆఫీస్ నుంచీ ఇంటికి వెళ్తూ ఎప్పుడు వెళ్ళే దారిలో కాకుండా వేరే దారిలో వెళ్తున్న లింటన్ ఈ హడావిడిలో లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేశాడు.అయితే

ఊహించని విధంగా కొన్ని రోజుల తరువాత లాటరీ నిర్వాహకుల నుంచీ లింటన్ కు ఫోన్ వచ్చింది.

తాను కొన్న లాటరి టిక్కెట్టు కు 2 మిలియన్ డాలర్లు గెలుచుకున్నారని వచ్చి చెక్కు తీసుకోవాలని చెప్పడంతో లింటన్ ఆనందానికి అవధులు లేవు.తాను గెలుచుకున్న రూ.15 కోట్ల డబ్బు కేవలం తన పెంపుడు కుక్క ఐవి కారణంగానే వచ్చిందని, ఈ క్రెడిట్ ఐవి కి చెందుతుందని లింటన్ తెలిపాడు.ఇదిలాఉంటే ఐవి కోసం ప్రత్యేకమైన వసతులు ఉన్న పెట్ హౌస్ కూడా కొనుగోలు చేశాడు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube