Flora Saini: నేను శ్రద్దా వాకర్ లా చనిపోవాల్సిందాన్ని.. బట్టలు లేకుండా రోడ్డుపై పరిగెత్తాను.. వెంకీ హీరోయిన్ కామెంట్స్ వైరల్!

ఫ్లోరా షైనీ.నీ పేరు వింటే చాలామంది గుర్తుపెట్టుకపోవచ్చు కానీ నరసింహనాయుడు సినిమాలోని లక్స్ పాపా హీరోయిన్ ఫ్లోరా షైనీ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు.

 Flora Saini Recalls Being Abused By Her Ex Boyfriend Details, Flora Saini, Boyfr-TeluguStop.com

బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమాలో బాలయ్య బాబుతో పాటు లక్స్ పాప లక్స్ పాప లంచుకొస్తావా అంటూ స్టెప్పులను ఇరగదీయడం మాత్రమే కాకుండా ఆ పాటతో ఇండస్ట్రీని మొత్తం షేర్ చేసింది.ఈ సినిమాతో పాటు తెలుగులో పలు సినిమాలలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

కానీ నరసింహారాయుడు సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.

అయితే సినిమాలో నటించిన తర్వాత ఆశా షైనీనా అనే పేరును ఫ్లోరా షైనీ గా మార్చుకుంది.

సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మెప్పించింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.ఇంటర్వ్యూలో భాగంగా తన ప్రియుడు నిర్మాత అయిన గౌరవ్ దోషి తనను ఏ విధంగా హింసించాడో చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

అతని కోసం నా కన్నవాళ్ళను కూడా వదిలేయడానికి సిద్ధపడ్డాను.గౌరవ్ మొదట్లో నన్ను బాగా చూసుకున్నాడు.

మా అమ్మ నన్ను కూడా అతనిని చూసి చాలా సంతోషపడ్డారు.

వారు కాదని చెప్పినా అతనితోపాటు వెళ్లిపోయాను.

కొన్ని రోజుల అంతా బాగానే ఉంది.కానీ ఆ తర్వాత అతని నిజ స్వరూపం బయటపడింది.ప్రతిరోజు నన్ను శారీరకంగా మానసికంగా హింసించేవాడు.శ్రద్ధ వాకర్ల నేను కూడా చావాల్సిందానిని.ఇంటి నుంచి వదిలి వచ్చిన వారం రోజుల్లోనే అతని చేతిలో చావు దెబ్బలు తిన్నాను.ఒకరోజు అతడు దవడ విరిగిపోయేలా కొట్టాడు.

అలాగే నిన్ను చంపేస్తాను అని అరుచుకుంటూ రావడంతో ఆ సమయంలో మా అమ్మ మాటలు గుర్తుకు వచ్చి ఏదైతే అది బయటకు పారిపోవడమే మంచిది అనుకొని ఒంటికి బట్టలు ఉన్నాయో లేదో కూడా గుర్తు లేకుండా పరిగెత్తాను.ఆ తర్వాత మళ్లీ అతని వైపు కన్నెత్తి కూడా చూడలేదు అని చెప్పుకొచ్చింది.

Flora Saini Recalls Being Abused by her Ex Boyfriend

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube