ఖమ్మం జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.ఈ క్రమంలోనే మున్నేరుకు భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది.
దీంతో ఖమ్మం – విజయవాడ హైవేపై మున్నేరు వరద నీరు భారీగా చేరింది.సుమారు 30 గ్రామాలకు ఖమ్మం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.
పలు గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి.దీంతో ప్జలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు భద్రాచలం వద్ద నీటిమట్టం 50 అడుగుల వద్ద కొనసాగుతోంది.
.