నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది.దీంతో అప్రమత్తమైన అధికారులు తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
ప్రాజెక్ట్ వద్ద ఇన్ ఫ్లో 2,69,288 క్యూసెక్కులుండగా.ఔట్ ఫ్లో 3,14,034 క్యూసెక్కులుగా ఉంది.
శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.ప్రస్తుతం 884.80 అడుగులుగా ఉందని అధికారులు తెలిపారు.శ్రీశైలం పూర్తి నీటినిల్వ 215 టీఎంసీలు, ప్రస్తుతం 214 టీఎంసీలుగా ఉందని వెల్లడించారు.
శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.







