సూర్యాపేట జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ జానయ్య యాదవ్ పై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి.ఈ మేరకు సుమారు వంద మంది బాధితులు ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ కు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.
తమను బెదిరించి అక్రమంగా తమ భూములను ఆక్రమించాడని బాధితులు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.ఈ క్రమంలో తమ భూములు ఇప్పించి న్యాయం చేయాలని ఎస్పీకి విన్నవించారు.
ఎస్పీకి సుమారు వంద మందికి పైగా బాధితులు వినతిపత్రం అందించారు.దీనిపై స్పందించిన ఎస్పీ బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరోవైపు డీసీఎంఎస్ ఛైర్మన్ జానయ్య వ్యవహారం మంత్రి జగదీశ్ రెడ్డికి తలనొప్పిగా మారిందని తెలుస్తోంది.ఇటీవల ఫిర్యాదులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో జానయ్యను మంత్రి దూరంగా పెట్టారని సమాచారం.
అయితే ఇంతకాలం జానయ్య మంత్రి జగదీశ్ రెడ్డికి సన్నిహితంగా ఉండటంతో బాధితులు ముందుకు రాలేదని తెలుస్తోంది.







