తమిళనాడులో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కావేరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది.
దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈరోడ్ నుంచి కర్ణాటక వెళ్లే రహదారిపై భారీగా వరద నీరు వచ్చి చేరింది.దీంతో ఈరోడ్, ధర్మపురి, సేలం జిల్లాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అంతేకాకుండా పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.మరోవైపు మెట్టూరు డ్యామ్ కి రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.
కాగా తమిళనాడులో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.