త్వరలోనే పిల్లల్ని కనాలనుకుంటున్నా.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా తెలుగులో ఒకరిద్దరు స్టార్ హీరోలు మినహా దాదాపుగా అందరు స్టార్ హీరోలకు జోడీగా నటించారనే సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో తమన్నాకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో పాటు తమన్నా సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

ఎఫ్3 సినిమాతో అబవ్ యావరేజ్ హిట్ ను సొంతం చేసుకున్న తమన్నా త్వరలో గుర్తుందా శీతాకాలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.అయితే పెళ్లికి దూరంగా ఉన్న తమన్నా తాజాగా పెళ్లి, పిల్లల గురించి స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న జైలర్ సినిమాలో తమన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు.తాజాగా తమన్నా మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల పాటు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల నేను పెళ్లి గురించి ఎక్కువగా ఆలోచించలేదని అన్నారు.

అయితే తాను పెళ్లికి వ్యతిరేకిని కాదని ఆమె కామెంట్లు చేశారు.

Advertisement

త్వరలోనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని అనుకుంటున్నానని ఆమె అన్నారు.తమన్నా పెళ్లైన వెంటనే పిల్లల్ని కనాలని అనుకుంటానని చెబుతూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు.తమన్నాతో పాటు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోయిన్లు ఇప్పటికే పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నారనే సంగతి తెలిసిందే.ఈ రీజన్ వల్లే తమన్నా కూడా పెళ్లిపై దృష్టి పెడుతున్నారని సమాచారం అందుతోంది.2022 సంవత్సరంలోనే తమన్నా పెళ్లికి సంబంధించిన శుభవార్త చెబుతారేమో చూడాల్సి ఉంది.తమన్నా సినిమా రంగానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారో లేక రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారో తెలియాల్సి ఉంది.

తమన్నాను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.దాదాపుగా 17 సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన తమన్నాకు సినిమా ఆఫర్లు తగ్గుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు