ల్యాండింగ్ సమయంలో అనూహ్య ఘటన.. దూకేసిన పైలెట్

రోడ్డు ప్రమాదాలతో పాటు విమాన ప్రమాదాలు కూడా ఇటీవల ఎక్కువైపోయాయి.ప్రపంచంలో, దేశంలో రోజు ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంటుంది.

 Flight Emergency Landing Co Pilot Jumps Without Parachute In North Carolina Deta-TeluguStop.com

అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, ఆల్కహాల్ తీసుకుని డ్రైవ్ చేయడం, డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ పై శ్రద్ధ పెట్టకపోవడం లాంటి ఘటనల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.ఇలాంటి రోడ్డు ప్రమాదాల వల్ల రోజుకు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇక విమాన ప్రమాద కూడా ఇటీవల ఎక్కువైపోయాయి.విమనాలు కూలిపోవడం, ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్యల వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.ప్రపంచంలో ఇటీవల విమాన ప్రమాదాలు కూడా ఎక్కువైపోయాయి.తాజాగా మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

యూఎస్ లోని నార్త్ కరోలినాలో ఒక విమాన ప్రమాదం చోటుచేసుకుంది.విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగింది.

విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో కో పైలెట్ కింద పడి చనిపోయాడు.

Telugu Pilot Jumps, Federal, Emergency, Carolina, Takeoff, Latest, Parachute-Lat

అయితే ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడా? లేదా కావాలని దూకేశాడా? అనేది చర్చనీయాంశంగా మారింది.ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో పారాచూట్ లేకుండా ఎలా దూకేస్తాడని అధికారులు అవమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇక విమానంలోని మరో పైలెట్ స్వల్ప గాయాలతో గాయపడగా.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

అయితే ఈ ప్రమాదానికి ముందు విమాన కుడివైపు ఉన్న చక్రం కోల్పోవడంతో పైలెట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సాయం కోరినట్లు అధికారులు స్పష్టం చేశారు.

కో పైలెట్ 23 ఏళ్ల చార్లెస్ హ్యూక్రూక్స్ గా అధికారులు గుర్తించారు.అతడి డెడ్ బాడీ ఎయిర్ పోర్టకు దక్షిణంగా సుమారు 48 కిలోమీటర్ల దూరంలో లభించినట్లు అధికారులు వివరించారు.

ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ, నేషనల్ సేఫ్టీ బోర్డు ఈ ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తుంది.ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube