అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఫ్లెక్సీ కలకలం చెలరేగింది.ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చీనీ తోటకు ఏడాదిన్నర పంట బీమా కొట్టేశారని మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
పంటల బీమాలో రైతులకు న్యాయం జరగలేదన్న జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నాయకులకే న్యాయం జరిగిందని తెలిపారు.క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో రూ.13.89 లక్షలు పెద్దారెడ్డి కొట్టేశారని ఆయన ఆరోపించారు.ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పెద్దారెడ్డి చీనీ తోటకు వస్తున్నానన్న జేసీ దమ్ముంటే ఆపాలంటూ సవాల్ చేశారు.దీంతో తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.







