ఆ విషయంపై టీఆర్ఎస్ లో పెరుగుతున్న అసంతృప్తి జ్వాలలు

టీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం కొంత గడ్డు కాలం నడుస్తున్నదని చెప్పవచ్చు.గతంతో పోలిస్తే ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున దూకుడు పెంచాయని చెప్పవచ్చు.

అయితే ఇక్కడ విచిత్రమేమిటంటే అసలు క్షేత్ర స్థాయిలో ఎటువంటి క్యాడర్ లేని బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు సంధిస్తున్న పరిస్థితి ఉంది.అయితే బీజేపీ ఇంతలా దూకుడు పెంచుతున్నది సోషల్ మీడియా ద్వారానే.

అయితే ఈ విషయంలో టీఆర్ఎస్ మాత్రం చాలా వెనుకబడి ఉందని చెప్పవచ్చు.ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది యువత సోషల్ మీడియాలోనే ఎక్కువగా గడుపుతున్న పరిస్థితి ఉంది.

దీంతో ఎంత ధీటుగా సోషల్ మీడియాలో ప్రతిపక్షాలను ఎదుర్కోగలిగితే అంతగా సోషల్ మీడియా లో కూడా టీఆర్ఎస్ వంద శాతం పట్టు సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉన్న పరిస్థితి ఉంది.

Advertisement

అయితే సోషల్ మీడియాలో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోలేకపోవడం, ఇటు బయట కూడా పెద్దగా ప్రతిపక్షాల విమర్శలపై స్పందించకపోవడంపై టీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్న పరిస్థితి ఉంది.అయితే కెసీఆర్ మౌనంగా ప్రస్తుత పరిస్తితులో ఉండడంపై పెద్ద ఎత్తున అందరినీ ఆశ్చర్యపరుస్తున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ నేతలు అసంతృప్తి గా ఉండటం అన్నది పెద్దగా ఆశ్చర్య పడే అంశం కాకపోవచ్చు.అయితే తనరాజకీయ జీవితంలో ఎన్నో అవరోధాలను తనకు అనుకూలంగా అవకాశంగా మార్చుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే.

అయితే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశాలు ఏవి అనే విషయంలో కెసీఆర్ కు క్లారిటీ ఉన్నప్పటికీ తగిన సమయంలో మాత్రమే వాటిని నెరవేర్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.మరి రానున్న రోజుల్లో టీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు