ఈ 5 తప్పులు చేస్తే మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది తెలుసా..?

క్రెడిట్ స్కోర్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు.మన క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటేనే మనకు సులభంగా రుణం లభిస్తుంది.

రుణ గ్రహీతలకు క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం.క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే రుణం లేదా క్రెడిట్ కార్డు పొందటం కష్టంగా మారుతుంది.మాములుగా అయితే క్రెడిట్ స్కోర్ అనేది 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది.750కి పైగా క్రెడిట్ స్కోర్ ఉంటే అదిబాగుంది అని.అయితే చాలా మందికి క్రెడిట్ స్కోర్ 750 కన్నా తక్కువగా ఉంటోంది.మీ ఆదాయం, సంపద వంటి వాటితో క్రెడిట్ స్కోర్‌కు పని లేదు.

తక్కువ వేతనం కలిగిన వారు కూడా అధిక క్రెడిట్ స్కోర్ కలిగి ఉంటారు.అలాగే మనం చేసే కొన్ని తప్పులువల్ల క్రెడిట్ స్కోర్‌ పై ప్రభావం పడే అవకాశముంది.

అయితే ఇప్పుడు క్రెడిట్ స్కోర్‌ ను దెబ్బతీసే 5 పొరపాట్లు గురించి తెలుసుకుందాం.అందులో మొదటిది లోన్ డబ్బులు తిరిగి కట్టకపోవడం.

Advertisement

లోన్ తీసుకున్న వ్యక్తి కచ్చితంగా ప్రతి నెలా ఈఎంఐ కడుతూ ఉండాలి.అలాగే క్రెడిట్ కార్డు బిల్లు కూడా చెల్లించాలి.

ఒకవేళ నెల నెల సరిగ్గా కట్టలేకపోతే మాత్రం క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది.అలాగే పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు వంటివి ఎక్కువగా తీసుకోవద్దు.

మీరు ప్రతి నెలా చెల్లించే రుణాల మొత్తం మీ శాలరీలో 50 శాతం దాటితే అప్పుడు మీ స్కోర్‌పై ఎఫెక్ట్ పడుతుంది.ఒక్కోసారి క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము.

అంటే కార్డుపై ఉన్న పరిమితికి మించి ఎక్కువగా ఉపయోగిస్తే అప్పుడు మీ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది.చాలా మంది క్రెడిట్ కార్డు బిల్లు కట్టకుండా మినిమమ్ బ్యాలెన్స్ చెల్లిస్తూ ఉంటారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

దీంతో బిల్లు మొత్తం పెరుగుతూనే వస్తుంది.

Advertisement

ఇలా చేయడం వల్ల కూడా క్రెడిట్ కార్డు స్కోర్ తగ్గుతుంది.అలాగే కొంతమంది ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ రుణాలకు అప్లై చేసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు రావొచ్చు.అందువల్ల లోన్‌కు అప్లై చేసే ముందు ఆలోచించాలి.

చాలా బ్యాంకులకు ఒకేసారి లోన్‌కు దరఖాస్తు చేసుకోకూడదు.అలా చేయడం వల్ల ప్రతి నెల అన్ని బ్యాంకులకు కరెక్ట్ గా డబ్బులు కట్టలేరు.

అప్పుడు స్కోర్ కూడా తగ్గిపోతుంది.

తాజా వార్తలు