13 ఏళ్లు క్రితం పోగొట్టుకున్న కెమెరా ( Camera ) తాజాగా చెత్తలో దొరికింది.ఇది నీటిలో పడినా, కఠినమైన వాతావరణ పరిస్థితులకు గురైనప్పటికీ, దీనిలోని ఎస్‌డీ కార్డ్ ( SD Card ) పని చేస్తూనే ఉండటం విశేషం.
దానితో తీసిన ఫొటోలు చెక్కుచెదరకుండా ఉన్నాయి.ఈ కెమెరాను 2010లో కొలరాడోలో ( Colorado ) తెప్ప యాత్రలో కోరల్ అమై అనే మహిళ పోగొట్టుకుంది.
అయితే ఇటీవల స్పెన్సర్ గ్రెనియర్ అనే మత్స్యకారుడు ఆ కెమెరా నదికి సమీపంలో చెత్తలో కూరుకుపోయినట్లు గుర్తించాడు.దానిని ఇంటికి తీసుకెళ్లాడు.
అతను కెమెరాలో ఎస్‌డీ కార్డ్ కాస్త చిట్లినా.ఇప్పటికీ పనిచేస్తూనే ఉందని కనుగొన్నాడు.మెమొరీ కార్డ్ యాక్సెస్ చేసినప్పుడు అందులో కొలరాడోలో జరిగిన వివాహం, బ్యాచిలొరెట్ పార్టీ, రివర్ రాఫ్టింగ్‌తో సహా జులై 2010 నుంచి చిత్రాలు, వీడియోలను కనుగొన్నాడు.ఇంత మంచి జ్ఞాపకాలను భద్రపరిచిన ఈ ఎస్‌డీ కార్డును యజమానికి తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
యజమాని కోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం ప్రారంభించాడు.అతను మెమొరీ కార్డులోని కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ చిత్రాలలోని ఎవరైనా మీకు తెలుసా అని ప్రజలను అడిగాడు.
హాలీ అనే మహిళ ఆ ఫోటోలలో తనను తాను వధువుగా గుర్తించింది.కెమెరా ఎవరిదై ఉంటుందా అనేది తెలుసుకోవడానికి తన స్నేహితులకు ఫోన్ చేసింది.అలా ఆమె ఆరా తీస్తుండగా రాఫ్టింగ్ ట్రిప్‌లో కోరల్ అమై దీన్ని కోల్పోయిందని తెలుసుకుంది.
ఆ విధంగా 13 ఏళ్ల తర్వాత తన కెమెరా మళ్లీ తన వద్దకే వచ్చింది.అందుకు అమై ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది.తనతో మాట్లాడటం మానేసిన స్నేహితులు, తన పిల్లలతో కెమెరా తనను మళ్లీ కనెక్ట్ చేసిందని చెబుతూ ఆమె సంతోషించింది.