ఏపీలో తొలి ఎన్నికల ఫలితం వెల్లడైంది.ఈ మేరకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి( Gorantla Butchaiah Chowdary) విజయం సాధించారు.
ఈ క్రమంలో సుమారు 61 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో బుచ్చయ్య చౌదరి గెలుపొందారు.కాగా ఈ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ( Chelluboyina Venugopala Krishna )వెనుకంజలో ఉన్నారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా మ్యాజిక్ ఫిగర్ దాటి మెజార్టీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.