మునుగోడు ఉప ఎన్నిక ముదురుతోంది.ప్రధాన పార్టీలు అన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.త్వరలో ఎన్నికలు రానుండటంతో ఈ ఎన్నికనే ప్రామాణికంగా భావిస్తున్నారు.
ఈ గెలుపునే పార్టీలు రేపు ప్రచారంలో చెప్పుకునే అవకాశం ఉంది.అందుకే మునుగోడు గెలిచి తీరాల్సిన పరిస్థితి.
జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ను పెట్టి మోదీని చీల్చి చెండాడుతున్న కేసీఆర్ సొంత రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికలో ఓటమి పాలు కాకూడదు.ఆ ప్రభావం రేపు ఆయన జాతీయ పార్టీపై కూడా ప్రభావం పడే అవకాశముంది.
అందుకే ఈ ఉప ఎన్నికను సీఎం కేసీఆర్ కు ప్రతిష్టాత్మకంగా మారిందనే చెప్పాలి.ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఆరు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.దీంతో పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలో జరిగిన తప్పిదం ఇప్పుడు జరగకుండా పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారట.ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని నిరూపించుకోవాలంటే ఈ మునుగోడు ఉప ఎన్నికలో ఖచ్చితంగా గులాబీ పార్టీ జెండాను ఎగరవేయాల్సి ఉంటుంది.
అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ బలమైన అభ్యర్తి కోసం మంతనాలు చేస్తోందట.ప్రత్యర్థులను ఎదుర్కొనాలంటే కేవలం నిధులు వెదజల్లితే కుదరదు.
హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఇప్పటికే టీఆర్ఎస్ కు గుణపాఠం నేర్పింది.అత్యంత ఖరీదైన ఎన్నిక జరిగిన హుజూరాబాద్ లోనూ టీఆర్ఎస్ గెలవలేదు.
ఎంతోమందికి పదవులు ఇచ్చినా ఫలించలేదు.ఈసారి మునుగోడు విషయంలో కేసీఆర్ ఆ ప్రయోగం చేయకపోవచ్చంటున్నారు.
నియోజకవర్గం సమస్యల వరకూ ఓకే కాని, విచ్చలవిడిగా డబ్బులు పంచినంత మాత్రాన గెలుపు సాధ్యం కాదన్న వాస్తవ విషయాన్ని ఇప్పటికే గ్రహించిన కేసీఆర్ వ్యూహాన్ని మార్చుకున్నారట.
మళ్లీ సర్వేలు.
ముఖ్యంగా మునుగోడులో సరైన అభ్యర్థిని ఎంపిక చేయడం తప్పనిసరి లేదంటే మొదటికే మోసం వస్తుంది.అయితే కేసీఆర్ ఇందుకు మళ్లీ సర్వేలను ఆశ్రయించవచ్చు.
మునుగోడులో బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.ఈటల రాజేందర్ బంధుగణం కూడా ఎక్కువగా ఉంది.
అందుకే అక్కడ ఆచితూచి అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది.అందుకే కేసీఆర్ కు మునుగోడు ఎన్నికలో అభ్యర్థి ఎంపిక అంత సులువు కాదని అంటున్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాలను పక్కన పెట్టి సొంత రాష్ట్రంలోని మునుగోడుపై దృష్టి పెట్టడమే కాదు.నిత్యం దానిపై కసరత్తు చేయాల్సి ఉంది.
ఇక అభ్యర్తి ఎంపిక ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.