పురాణ ఫాంటసీ కథతో నిఖిల్20.. కంటెంట్ ఓరియెంటెడ్ కథలతో దూసుకెళ్తున్న యంగ్ హీరో!

వరుస విజయాలతో నిఖిల్ సిద్ధార్థ్( Nikhil Siddhartha ) మంచి జోరు మీద ఉన్నాడు.ఈయన కెరీర్ ఈ మధ్య జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతుంది అనే విషయం విదితమే.

 First Look Of Nikhil Siddhartha's 20th Film To Be Out, Nikhil Siddhartha, Spy,-TeluguStop.com

నిఖిల్ కెరీర్ లో కార్తికేయ 2 సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు.తెలుగులో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న నిఖిల్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్ కూడా మంచి విజయం సాదించింది.దీంతో ఈ కుర్రహీరోతో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు భారీగా పోటీ పడుతున్నారు.నిఖిల్ పాన్ ఇండియా వ్యాప్తంగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”స్పై( SPY )”.యాక్షన్ థ్రిల్లర్ గా బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే ఇడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.

Telugu Pages, India, Nikhil, Tollywood-Movie

ఇది జూన్ చివరిలో రిలీజ్ కానుంది.ఇక ఇది రిలీజ్ కు రెడీ చేస్తూనే నిఖిల్ మరిన్ని సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే.ఈ మధ్యే నిఖిల్ హీరోగా ‘ది ఇండియా హౌస్’ పేరుతో రామ్ చరణ్ నిర్మాతగా వి మెగా పిక్చర్స్ బ్యానర్ పై మొదటి సినిమాను గ్రాండ్ లెవల్లో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా 1900 దశకంలో భారతదేశ చరిత్రలో జరిగిన కథాంశంతో తెరకెక్కుతుంది.

Telugu Pages, India, Nikhil, Tollywood-Movie

ఇదిలా ఉండగా ఈ యువ హీరో మరో సినిమాను ప్రకటించారు.ఇది ఆయన కెరీర్ లో 20వ సినిమాగా కాగా ఈ రోజు ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రాబోతున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా యువ యోధుడిని వర్ణించే పురాణ ఫాంటసీ కథ అని తెలుస్తుంది.

భరత్ కృష్ణమాచారి ( Bharath Krishnamachari )దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ లు సంయుక్తంగా నిర్మిస్తుండగా రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు.ఇలా ఈ యువ హీరో కంటెంట్ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ పాన్ ఇండియా రేంజ్ లో దూసుకు పోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube