పురాణ ఫాంటసీ కథతో నిఖిల్20.. కంటెంట్ ఓరియెంటెడ్ కథలతో దూసుకెళ్తున్న యంగ్ హీరో!
TeluguStop.com
వరుస విజయాలతో నిఖిల్ సిద్ధార్థ్( Nikhil Siddhartha ) మంచి జోరు మీద ఉన్నాడు.
ఈయన కెరీర్ ఈ మధ్య జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతుంది అనే విషయం విదితమే.
నిఖిల్ కెరీర్ లో కార్తికేయ 2 సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు.
తెలుగులో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న నిఖిల్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్ కూడా మంచి విజయం సాదించింది.దీంతో ఈ కుర్రహీరోతో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు భారీగా పోటీ పడుతున్నారు.
నిఖిల్ పాన్ ఇండియా వ్యాప్తంగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''స్పై( SPY )''.
యాక్షన్ థ్రిల్లర్ గా బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే ఇడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. """/" /
ఇది జూన్ చివరిలో రిలీజ్ కానుంది.
ఇక ఇది రిలీజ్ కు రెడీ చేస్తూనే నిఖిల్ మరిన్ని సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే.
ఈ మధ్యే నిఖిల్ హీరోగా 'ది ఇండియా హౌస్' పేరుతో రామ్ చరణ్ నిర్మాతగా వి మెగా పిక్చర్స్ బ్యానర్ పై మొదటి సినిమాను గ్రాండ్ లెవల్లో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా 1900 దశకంలో భారతదేశ చరిత్రలో జరిగిన కథాంశంతో తెరకెక్కుతుంది. """/" /
ఇదిలా ఉండగా ఈ యువ హీరో మరో సినిమాను ప్రకటించారు.
ఇది ఆయన కెరీర్ లో 20వ సినిమాగా కాగా ఈ రోజు ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రాబోతున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమా యువ యోధుడిని వర్ణించే పురాణ ఫాంటసీ కథ అని తెలుస్తుంది.
భరత్ కృష్ణమాచారి ( Bharath Krishnamachari )దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ లు సంయుక్తంగా నిర్మిస్తుండగా రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు.
ఇలా ఈ యువ హీరో కంటెంట్ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ పాన్ ఇండియా రేంజ్ లో దూసుకు పోతున్నాడు.
ఇదేం పైత్యం రా బాబు.. పక్కటెముకలు తీయించుకుని అందులో పెట్టుకుంటుందట..?