తెలంగాణ రాష్ట్రంలో మరి కొద్ది రోజులలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు రకరకాల వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి.
గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) విజయం సాధించింది.ఈ క్రమంలో ఈ పార్లమెంటు ఎన్నికలలో కూడా విజయం సాధించి.
మరింత బలపడేందుకు టీకాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఇక అధికారం కోల్పోయిన బీఆర్ఎస్( BRS ) పార్లమెంట్ ఎన్నికలలో సత్తా చాటడానికి రెడీ అవుతుంది.
కాగా గత అసెంబ్లీ ఎన్నికలలో( assembly elections ) ఆశించిన స్థాయిలో రాణించ లేకపోయినా బీజేపీ.పార్లమెంట్ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.దీంతో తెలంగాణకు బీజేపీ కీలక నాయకులు అమిత్ షా, మోదీ వాటి నేతలు ఎన్నికలలో ప్రచారానికి సిద్ధమవుతున్నారు.ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గాన్ని అమిత్ షా దగ్గర ఉండి నడిపిస్తున్నారు.
దీంతో తాజాగా పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి బీజేపీ అధిష్టానం మొదటి లిస్టు విడుదల చేయడం జరిగింది.
కరీంనగర్ – బండి సంజయ్ నిజామాబాద్ – అర్వింద్ జహీరాబాద్ – బీబీ పాటిల్ మల్కాజిగిరి – ఈటల రాజేందర్ సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి హైదరాబాద్ – మాధవీలత చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్ రెడ్డి నాగర్ కర్నూల్ – భరత్ భువనగిరి – బూర నర్సయ్య గౌడ్
.