ఐపీఎల్ 17 సీజన్( IPL 17 Season ) మార్చి 22వ తేదీ నుంచి మొదలు కాబోతుంది.ఇక ఇప్పటికే ఈ సీజన్ లో కప్పు కొట్టడానికి అన్ని టీంలు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి.
ఇక అందులో భాగంగానే బెంగుళూరు టీం కూడా తను అడబోయే మ్యాచ్ లా మీద స్పెషల్ కేర్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఐపీఎల్ మొదలై 16 సంవత్సరాలు గడిచిన కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా బెంగళూరు టీం( Bangalore team ) కప్పు కొట్టకపోవడం పట్ల ఆ టీం అభిమానులు తీవ్రమైన నిరాశకి లోనవుతున్నారు.
ప్రతి సంవత్సరం టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నప్పటికీ బెంగళూరు టీమ్ మాత్రం ఏదో ఒక కారణం చేత కప్పు అయితే దక్కించుకోకుండా టోర్నీ నుంచి వెనుతిరుగుతుంది.ఇక కోహ్లీ( Kohli ) కెప్టెన్ గా ఉన్నప్పుడు డివిలియర్స్ లాంటి హార్డ్ హిట్టర్ కూడా ఈ టీమ్ లో ఉన్నాడు.
అయిన కూడా కప్పు అయితే గెలవలేకపోయారు.
ఇక గత రెండు సీజన్ల నుంచి బెంగళూరు టీం కి డూప్లిసిస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నప్పటికీ పెద్దగా ప్రభావం అయితే చూపించలేక పోతున్నారు.ఇక కెప్టెన్ మాత్రమే మారాడు తప్ప టీం పర్ఫామెన్స్ లో పెద్దగా తేడాలైతే కనిపించడం లేదు.అంటు గత సంవత్సరం చాలా విమర్శలను ఎదురుకుంది.
ఇక దాంతో ఇప్పుడు బెంగళూరు యాజమాన్యం ఎలాగైనా సరే ఈ ఇయర్ టైటిల్ దక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది.ఇక ఈ సీజన్ లో వీళ్ళ టీమ్ లోకి ఆస్ట్రేలియన్ దిగ్గజ ఆల్ రౌండర్ ప్లేయర్ అయిన కెమెరన్ గ్రీన్( Cameron Greene ) రావడం వీళ్ళకు చాలా వరకు ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
ముఖ్యంగా బెంగళూరు టీం కి మొదటినుంచి ఉన్న సమస్య ఏంటి అంటే మిడిలార్డర్ లో సరిగ్గా ఆడే ప్లేయర్లు లేకపోవడం దానివల్లే బెంగుళూర్ టీమ్ ప్రతిసారి ఓటమి పాలవుతూ వస్తున్నారు.ఇక గ్రీన్ టీమ్ లో ఉంటే తనని ఓపెనర్ గా వాడుకోవచ్చు, అలాగే ఫినిషర్ గా కూడా పని చేస్తాడు.కాబట్టి బెంగళూరు టీం అతని మీద భారీ అంచనాలను పెట్టుకొని బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది.తను బౌలింగ్ కూడా చేస్తాడు కాబట్టి ఆల్ రౌండర్ ప్రదర్శనని ఇచ్చి బెంగళూరు టీమ్ కి ఈసారి కప్పు అందిస్తాడనే కాన్ఫిడెంట్ తో బెంగళూరు టీమ్ యాజమాన్యం ఉంది.
ఇక ఆ టీం అభిమానులు కూడా వేచి ఒక్కసారి ఆర్సిబి కప్పు కొడితే చూడాలనుకుంటున్నారు…
.