త్రిబుల్ ఆర్ సినిమాలో ముందుగా అనుకున్నది రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు కాదట.. ఎవరంటే?

సాధారణంగా సినిమాల్లో ఒక హీరో కోసం కథ రాసుకోవడం ఇక ఆ తర్వాత ఆ సినిమాను వేరే హీరోతో తెరకెక్కించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది.

అయితే ఏ దర్శకుడైనా అలా చేస్తారేమో కానీ దర్శక ధీరుడు రాజమౌళి మాత్రం ఒక హీరోతో సినిమా చేయాలనుకుంటే ఆ హీరోతోనే సినిమా చేస్తూ ఉంటాడు.

ఆ హీరోతో సినిమా చేసే ఛాన్స్ దక్కక పోతే ఆ కథని పక్కకు పెట్టేస్తూ ఉంటారు.ఇది ఎవరో చెప్పింది కాదు ఇప్పటి వరకు ఎన్నో ఇంటర్వ్యూలలో దర్శక ధీరుడు రాజమౌళి చెప్పేసారు.

తను అనుకున్న హీరో సినిమా చేయలేకపోతే కథను పక్కన పెట్టేస్త అని తెలిపాడు.అయితే ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా లో మాత్రం రాజమౌళి ఇలా చేయలేదట.

జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు హీరోలుగా మల్టీస్టార్ సినిమా త్రిబుల్ ఆర్ రిలీజయింది.మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.

Advertisement

ఇక ఆయా పాత్రల్లో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తప్ప ఇంకెవరు సెట్ కారేమో అన్నంతగా ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి వైరల్ అవుతున్న వార్త మాత్రం అభిమానులను షాక్కు గురి చేసింది.ముందుగా త్రిబుల్ ఆర్ సినిమా కథ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ కాదట.ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు ఏకంగా స్టోరీ అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ చెప్పడం గమనార్హం.

ముందుగా హీరోని ఊహించుకో కుండా కథ రాయాలని అనుకున్నారట.

తర్వాత రజనీకాంత్- అర్జున్ తర్వాత సూర్య -కార్తీ ఇలా రెండు జంటలతో సినిమా తీస్తే బాగుంటుందని అనుకున్నారట విజయేంద్రప్రసాద్.కానీ చివరికి ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో తమ ఆలోచన ఆగిపోయిందన్న విషయం చెప్పారు ఆయన.ఇక ఈ సినిమాకు ఇద్దరిని ఎంచుకోవడానికి కారణం నిజజీవితంలో కూడా ఇద్దరు మంచి స్నేహితులు కావడమే అని విజయేంద్రప్రసాద్ చెప్పారు.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు