ప్రపంచంలో అనేక చిత్ర, విచిత్రాలు జరుగుతూ ఉంటాయి.అనేక ఆశ్చర్యకర, నిర్వెరపోయే ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి.
అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి.మనం నమ్మలేని అనేక ఘటనలు ప్రపంచంలోనే రోజూ జరుగుతూ ఉంటాయి.
కానీ అందులో మనకు తెలిసినవి కొన్నే ఉంటాయి.మరికొన్ని మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి.
అవి కొంతమంది కంటి వెంట పడుతూ ఉంటాయి.అప్పుడు అవి బయటకకు వస్తూ ఉంటాయి.
తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.మధ్యప్రదేశ్ లోని ఓ విలేజ్ లో బోరింగ్ లో నీళ్లకు బదులు నిప్పులు వచ్చాయి.కచ్చర్ అనే గ్రామంలో ఈ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది.బోరింగ్ నుంచి నీళ్లతో పాటు నిప్పు కూడా వస్తుంది.
నీళ్లతో పాటు మంటలు చెలరేగుతూ ఉన్నాయి.ఇది చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నాయి.
నీళ్లతో పాటు నిప్పు ఎలా వస్తుందనేది స్థానికులకు అర్థం కాక తలలు పెట్టుకుంటున్నారు.
దీనిని వీడియో తీసి కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీనిపై అధికారులకు సమాచారం ఇచ్చారు.
మిథేన్ వాయువు వల్ల మంటలు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు.మరికొంతమంది మాత్రం రసాయనం లీక్ కావడం వల్ల నిప్పులు వస్తున్నట్లు చెబుతున్నారు.
భూమి లోపల నుంచి మిథేన్ వాయివు లీక్ అవుతుందని, అందుకే నీళ్లతో పాటు మంటలు బయటకు వస్తున్నాయని చెబుతున్నారు.కచ్చర్ గ్రామం ఛతర్ పూర్ జిల్లాలోని బక్స్ ాహ పంచాయతీకి 10 కి.మీ దూరంలో ఉంది.విలేజ్ లోని ఈ బోరింగ్ పాతపడిపోయింది.
బోర్ లో నీళ్లతో పాటు మంటలు రావడం చూసి ఆశ్చర్యపోతున్నారు.







