నోట్లోంచి మంటలు వచ్చే విన్యాసం.. బెడిసి కొట్టి మూతి కాలింది..

చాలా చోట్ల జాతరలలో నోటిలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ పోసి వాటిని గాలిలోకి ఊదుతుంటారు.వారి చేతులలో కాగడాలు వంటివి ఉంటాయి.

 Fire Coming Out Of The Mouth Fire Stunt, Mouth Fire Video, Viral Video, Gone Wro-TeluguStop.com

దీంతో ఒక్కసారిగా వారి నోటిలో నుంచి మంటలు వస్తున్నాయని మనకు అనిపిస్తుంది.చాలా మంది మెజీషియన్లు కూడా వీటిని చేస్తారు.

అయితే వారు పలు జాగ్రత్తలను తీసుకుంటారు.ఏ మాత్రం ప్లాన్ బెడిసికొట్టినా, మూతితో పాటు ముఖం కాలిపోతుంది.

తాజాగా ఇలాంటి పనిని ఓ యువకుడు చేశాడు.తాను సోషల్ మీడియాలో సెలబ్రెటీ అయిపోవాలని భావించాడు.

అచ్చం తాను వీడియోలలలో చూసినట్లే చేసి, భారీగా వ్యూస్, లైకులు సంపాదించాలనుకున్నాడు.అయితే చివరికి అతడి మూతి కాలిపోయింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

సోషల్ మీడియాలో సెలబ్రెటీలు కావాలని చాలా మంది యువత భావిస్తున్నారు.

దీని కోసం అవసరమైతే ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి కూడా వెనుకాడడం లేదు.సోషల్ మీడియా పిచ్చి వారిని ఇలా చేయిస్తోంది.

తాజాగా ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడం కోసం నోటిలో నుంచి మంటలు వచ్చేలా చేయాలని భావించాడు.అందుకోసం ముందుగా నోటిలో పెట్రోల్ పోసుకున్నాడు.

ఓ కర్రకు కాగడా మాదిరిగా మంటలు పుట్టించాడు.నోటిలో నుంచి ఆవిరి రూపంలో పెట్రోల్‌ను ఊదాలని అనుకున్నాడు.

అయితే ఒకేసారి పెట్రోల్ మొత్తం ఊదేశాడు.ఫలితంగా ఒక్కసారిగా మంటలు అతడి ముఖానికి అంటుకున్నాయి.

తొలుత అతడి పెదవులు, మూతి మొత్తం కాలిపోయింది.క్షణాల్లోనే అతడి ముఖానికి కూడా మంటలు వ్యాపించాయి.

వాటిని వదిలించుకునేందుకు అతడు ప్రయత్నించాడు.బాధతో విలవిల్లాడిపోయాడు.

దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.సోషల్ మీడియా పిచ్చితో ఏది పడితే అది చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందని పేర్కొంటున్నారు.సోషల్ మీడియాలో లైకుల కోసం ప్రాణాలను పణంగా పెట్టాలనుకోవడం పిచ్చితనమేనని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.ఏదేమైనా అతడికి తిక్క కుదిరిందని, ఈ వీడియో చూస్తే ఎవరికీ ఇలాంటి పిచ్చి పని చేయాలని అనిపించదని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube