వామనరావు దంపతుల హత్య కేసులో వారి పై ఎఫ్ఐఆర్ నమోదు.. నిందితులు ఎవరంటే.. ?

తెలంగాణ రాష్ట్రం ఉలిక్కిపడేలా జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి హత్యల విషయంలో ఎన్నో సంచలన విషయాలు దాగున్నాయట.ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయంలో సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.

 Fir Registered Against Three Persons In Vamanrao Couple Murder Case, Peddapalli,-TeluguStop.com

ఈ హాత్యకు కారణం తెలంగాణ ప్రభుత్వం అని విమర్శలు కూడా చేస్తున్నారు.ఇకపోతే నిన్న పెద్దపల్లి జిల్లా కవలచర్ల వద్ద ఈ హత్య జరిగిన విషయం తెలిసిందే.

కాగా వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో నిందితులుగా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Telugu Fir Registered, Kumar, Kunta Srinu, Peddapalli, Vamana Rao, Vasanta Rao-L

అందులో ఏ1గా వసంతరావు, ఏ2గా కుంట శ్రీను, ఏ3గా కుమార్ లపై కుట్ర, హత్య అభియోగాలు మోపారు.వారిపై ఐపీసీ 120బి, 302, 341, 34 కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.అయితే ఈ హత్యకు ఈ స్థల వివాదమే కారణం కావొచ్చన్న విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు కొందరు అధికారపార్టీ నేతల హస్తం కూడా ఉందని ప్రచారం జరుగుతుంది.మరి నిజానిజాలూ పోలీసులు వెలికితీస్తే గానీ ఈ హత్యలో ఎవరెవరి హస్తం ఉందో తెలియదు.

అంతవరకు వేచి చూడవలసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube