ఈ ఫొటోలో ఉన్న పులిని క‌నిపెట్టండి.. మీ త‌రం కాదేమో

అడ‌వి జంతువుల‌కు సంబంధించి ఎలాంటి ఫొటో అయినా ఇట్టే వైర‌ల్ అయిపోతుంది సోష‌ల్ మీడియాలో.

ఎందుకంటే అడ‌వి జంతువులు అంటే ప్ర‌తి ఒక్క‌రికీ కూడా ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది.

ఇక వీటికి సంబంధించిన డిఫ‌రెంట్ వీడియోలు అయితే నెట్టింట ఎంత హ‌ల్ చ‌ల్ చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఇక ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ఈ జంతువుల‌కు సంబంధించిన ఫ‌జిల్ ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి.

అదేంటంటే ఈ మ‌ధ్య చాలా మ‌దికి ఈ క‌రోనా వ‌ల్ల వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ కార‌ణంగా ఇలాంటి ఫైండ్ ది ఆబ్జెక్ట్ పజిల్స్‌పై చాలా ఇంట్ర‌స్ట్ కనబరుస్తున్నారు.ఇక సోషల్ మీడియాలో ఇలాంటి ఫొటోలు కోకొల్లలుగా ఉంటాయి.

ఇలాంటి వాటికి కొదువ లేకుండా ఎప్పుడూ ఏదొకటి నెట్టింట పోస్టు చేస్తూనే ఉంటారు నెటిజ‌న్లు.మ‌రి కొన్నిసార్లు అయితే కొత్త‌వి లేక‌పోతే పాత పజిల్స్ ఫొటోలు కూడా వైరల్ చేస్తుంటారు.

Advertisement

ఇక ఇప్పుడు మ‌నం మాట్లాడుకోబోయేది కూడా అలాంటి అడ‌వి జంతువుల‌కు సంబంధించిన పిక్చర్ పజిల్ గురించే.పైన మీకు క‌నిపిస్తున్న ఫొటోలో ఓ పులి జింకను వేటాడటానికి పొద‌ల న‌డుమ క‌న‌ప‌డ‌కుండా నక్కి ఉంది.

దాన్ని చాలా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించి ఎక్కడ ఉందో కనిపెట్ట‌డ‌మే ఇప్పుడున్న ఫ‌జిల్‌.

అయితే ఈ ఫోటో చూస్తుంటే మీకు ఓ జింక సరదాగా కొలను ద‌గ్గ‌ర సేద తీరేందుకు వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తుంది.కానీ అక్క‌డే ఆ జింక‌ను ఆహారంగా మార్చుకునేందుకు వేట‌కు సిద్ధంగా ఉన్న ప్రమాదకరమైన క్రూర జంతువు కూడా నక్కి ఉంది.ఎలాగైనా స‌రే తన ఎరను వేటాడి త‌న క‌డుపు నింపుకోవాల‌ని పులి ప‌చ్చిన పొద‌ల న‌డుమ దాక్కుని ఉంది.

స‌రిగ్గా గ‌మ‌నిస్తే ఆ జింక త‌ల‌పై భాగంలో ప‌చ్చిన గ‌డ్డి మ‌ధ్య దాని ముఖం క‌నిపిస్తుంది.కాక‌పోతే పూర్తిగా కాకుండా కొంచెం మాత్ర‌మే క‌నిపిస్తుంది.మ‌రి మీరు కూడా అదెక్క‌డ ఉందో క‌నిపెట్టండి.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు