నాగార్జున ద్విపాత్రాభినయంలో రమ్యకృష్ణ లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా తర్వాత నాగార్జున నటించిన ఏ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేక పోయాయని చెప్పవచ్చు.ఇదిలా ఉండగా సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి సీక్వెల్ చిత్రంగా బంగార్రాజు చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.
ఇందులో నాగార్జునతో పాటు నాగచైతన్య నటించగా రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు.ఇకపోతే ఈ చిత్రాన్ని అన్నపూర్ణ బ్యానర్ పై నాగార్జున జి5 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే సుమారు 30 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకేక్కించాలని భావించగా ఇప్పటికే ఈ సినిమా అనుకున్న దానికన్నా పెద్ద మొత్తంలో బడ్జెట్ ఖర్చు అయినట్లు తెలుస్తోంది.

అనుకున్న దాని కన్నా అధిక మొత్తంలో బడ్జెట్ ఖర్చు పెట్టడంతో జీ5 స్టూడియోస్ వెనకడుగు వేయగా నాగార్జున మాత్రం ఎలాగైనా ఈ సినిమాని పూర్తి చేయాలని భావిస్తూ డబ్బు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే సుమారు 45 కోట్ల వరకు ఈ సినిమాకి ఖర్చు చేయడంతో నాగార్జునకు లోలోపల కాస్త భయంగానే ఉన్నట్లు సమాచారం.ఇలా బంగార్రాజు సినిమా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
గత కొన్ని సంవత్సరాలుగా నాగార్జున నటించిన సినిమా హిట్ కాకపోవడంతో ఈ సినిమా కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం వల్ల నాగార్జున ఈ విషయంలో కాస్త భయపడుతున్నట్లు తెలుస్తోంది.