ఎట్టకేలకు కల నెరవేరింది... ఆ స్టార్స్ తో నటించడం పై తమన్నా కామెంట్స్!

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్న( Thamannah ) ప్రస్తుతం పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా నటిగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె నటించిన సినిమాలు రెండు ఒకరోజు వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ( Rajinikanth ) నటించిన జైలర్( Jailer ) సినిమా ద్వారా ఈమె ఆగస్టు 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) హీరోగా నటించిన భోళా శంకర్( Bhola Shankar ) సినిమా ద్వారా ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ విధంగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలలో నటించి ఆ రెండు సినిమాలు కూడా ఒకరోజు వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు రావడంతో తమన్నా ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి తమన్న ఇలా సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలలో నటించడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇలా సూపర్ స్టార్ మెగాస్టార్ లాంటి ఇద్దరు హీరోల సినిమాలలో నటించడంతో నా కల నెరవేరిందని ఈమె తెలియజేశారు.

చిరంజీవి గారితో డాన్స్ చేసే అవకాశం రావడం తన అదృష్టమని.డాన్స్ లో ఇప్పుడు వాడుతున్న స్టైల్స్ ఆయన దగ్గర నుంచే వచ్చాయని అన్నారు.ఇక చిరంజీవి గారితో కలిసిన నటించిన ఈ సినిమా తనకు ఎప్పటికీ ప్రత్యేకమైన అని తెలియజేశారు చిరంజీవి మాత్రమే కాకుండా రామ్ చరణ్( Ramcharan ) కూడా చాలా మంచి నటుడు వీరిద్దరూ కూడా చాలా సపోర్టివ్ గా ఉంటారని ఈ సందర్భంగా తమన్న రామ్ చరణ్ అలాగే చిరంజీవి గారితో సినిమాలలో నటించడం పట్ల తన అభిప్రాయాలను అనుభవాలను తెలియజేశారు.

Advertisement

ఇక ఈమె రామ్ చరణ్ తో కలిసి రచ్చ( Rachha ) అనే సినిమాలో నటించి సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?
Advertisement

తాజా వార్తలు