ఫైలెట్ రోహిత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అయ్యప్ప మాలలో ఉన్నందున రోహిత్ రెడ్డిపై మాట్లాడటం లేదని చెప్పారు.

 Filet Rohit Reddy Bjp Mla Raghunandan Rao Fire-TeluguStop.com

ఆయన మాల విరమణ చేసిన తర్వాత రోహిత్ రెడ్డి గురించి అన్ని వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.నిజంగా తాను ఇల్లీగల్ పనులు చేస్తే ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ లో ఉన్నప్పుడు దొరలు అని మాట్లాడిన రోహిత్ రెడ్డి ఇప్పుడు దొరల గూటికే చేరారని విమర్శించారు.రోహిత్ రెడ్డి ఏ చెట్టుపై కూర్చుంటే ఆ మాటలే మాట్లాడుతారని ఎద్దేవా చేశారు.

ప్రగతిభవన్ నుంచి వచ్చి చిలుక పలుకులు మాట్లాడుతున్నారన్నారు.రాజకీయాలు అంటే డ్రగ్స్ తీసుకున్నంత సులువు అనుకుంటున్నారన్న ఆయన సర్పన్ పల్లిలో అక్రమాలకు పాల్పడలేదా అని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube