ఫారం-16ను వాడుకుని ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఇలా ఫైల్ చేసుకోండి మిత్రులారా!

ఉద్యోగులకు( Employees ) ఈ విషయం బాగా తెలిసినదే.కంపెనీలలో పనిచేసే వారికి కంపెనీ తరపున ఉద్యోగుల జీతం నుంచి టిడియస్( TDS ) తీసివేయబడుతుందనే విషయాన్ని మీరు వినే వుంటారు.

 File Income Tax Returns Using Form 16 Details, Income Tax, Income Tax Tips, Form-TeluguStop.com

ఫారమ్ 16ని( Form 16 ) కంపెనీ ప్రతి సంవత్సరం మే ఆఖరి నాటికి మునుపటి ఆర్థిక సంవత్సరానికి జారీ చేస్తుంది.ఇది ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు దీని పీరియడ్ ఉంటుంది.

ఇక ఫారం 16 అనేది తప్పనిసరిగా కంపెనీ తన ఉద్యోగులకు జారీ చేసే సర్టిఫికేట్ అని తెలిసిందే.ఈ సర్టిఫికేట్ మీ జీతం నుంచి టిడియస్ కట్ అయిందని, అదే సమయంలో ఉద్యోగి తరపున ప్రభుత్వ అధికారుల వద్ద డిపాజిట్ చేయబడిందనే దానికి గుర్తు.

అయితే ఫారం 16 ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడంలో ఉపయోగపడే ప్రతి ముఖ్యమైన వివరాలను కలిగి ఉంటుంది.దీని ద్వారా మీరు టీడీఎస్‌గా తీసివేసిన డబ్బును తిరిగి పొందవచ్చనే సంగతి మీకు తెలిసినా అది ఎలాగో ఇక్కడ చాలామందికి తెలియదు.

ఇపుడు తెలుసుకోండి.ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ని లో ఆదాయపు పన్ను ఫారమ్ విభాగం క్రింద సందర్శించవచ్చు.

ఫారమ్ 16, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఇతర సంబంధిత పత్రాలతో సహా మీ అన్ని ఆర్థిక పత్రాలను మొదట సిద్ధం చేసుకోవాలి.

Telugu Tax Returns, Form, Financial, Tax, Tax Tips, Itr, Itr Returns-Latest News

మీ పన్నులను ఫైల్ చేస్తున్నప్పుడు ఈ విషయాలు తప్పనిసరిగా గమనించండి.ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం కోసం ఒక ఖాతాను క్రియేట్ చేసుకోవాలి.ఇప్పటికే ఖాతా ఉంటే లాగిన్ కావాల్సి ఉంటుంది.

మొదట ఇ-ఫైల్ విభాగంలో అందుబాటులో ఉన్న “ఆదాయ పన్ను రిటర్న్”పై క్లిక్ చేయాలి.

Telugu Tax Returns, Form, Financial, Tax, Tax Tips, Itr, Itr Returns-Latest News

ఇపుడు మీ ఆదాయానికి తగిన పన్ను రిటర్న్ (ITR) ఫారమ్‌ను ఎంచుకోండి.మీకు ఫారమ్ 16 ఉంటే, అప్పుడు ITR-1 లేదా ITR-2 సెలెక్ట్ చేసుకోవాలి.ఇపుడు వ్యక్తిగత వివరాలు, ఆదాయ వివరాలు, తగ్గింపులు, పన్ను చెల్లింపులు వంటి వివరాలను నమోదు చేయాలి.

మీరు అక్కడ అందించిన మొత్తం సమాచారాన్ని ధృవీకరించి, ఫారమ్‌ను సమర్పించండి.తర్వాత, మీ ఆధార్ నుండి ఓటీపీ మొదలైన యాక్సెస్ చేయగల పద్ధతుల్లో అది ధృవీకరించబడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube