పొట్టుపొట్టు కొట్టుకోనున్న ఆర్ఆర్ఆర్ హీరోలు

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

 Fight Between Ram Charan Ntr In Rrr To Be Crucial, Ram Charan, Ntr, Rrr, Rajamou-TeluguStop.com

ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఏ రేంజ్‌లో ఉతికారేస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.అయితే ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉండటంతో ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసింది.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్, దోస్తీ అనే ఫస్ట్ సాంగ్‌తో సోషల్ మీడియాను దడదడలాడిస్తోంది ఈ సినిమా.ఈ చిత్రంలో చరణ్, తారక్‌ల మధ్య దోస్తీ ఏ రేంజ్‌లో ఉండబోతుందో ఇటీవల రిలీజ్ అయిన పాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

కానీ ఈ సినిమాను తెరకెక్కించేది జక్కన్న.ఆయన ఏం ప్లాన్ చేస్తాడో ఎవరికీ అర్థం కాదు.

ఇప్పుడు అలాంటిదే ఈ సినిమాలో ఓ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాలో చరణ్-తారక్‌ల మధ్య ఓ భీకర యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

కథలో భాగంగా ఈ ఇద్దరు హీరోలు ఎదురుపడినప్పుడు వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్‌లో ఉండబోతుందని, ఈ ఫైట్ సీన్ ప్రేక్షకుల ఊహకందని విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

మరి దోస్తీకి కేరాఫ్‌గా ఉండబోయే ఈ రెండు పాత్రలు అసలు పొట్టుపొట్టుగా ఎందుకు కొట్టుకుంటారో తెలియాలంటే ఆర్ఆర్ఆర్ సినిమా చూడాల్సిందే.రాజమౌళి సార్.

దయచేసి ఈ సినిమాను త్వరగా రిలీజ్ చేయండి.ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం.

అని అంటున్నారు ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube