పొట్టుపొట్టు కొట్టుకోనున్న ఆర్ఆర్ఆర్ హీరోలు

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఏ రేంజ్‌లో ఉతికారేస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

అయితే ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉండటంతో ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసింది.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్, దోస్తీ అనే ఫస్ట్ సాంగ్‌తో సోషల్ మీడియాను దడదడలాడిస్తోంది ఈ సినిమా.

ఈ చిత్రంలో చరణ్, తారక్‌ల మధ్య దోస్తీ ఏ రేంజ్‌లో ఉండబోతుందో ఇటీవల రిలీజ్ అయిన పాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

కానీ ఈ సినిమాను తెరకెక్కించేది జక్కన్న.ఆయన ఏం ప్లాన్ చేస్తాడో ఎవరికీ అర్థం కాదు.

ఇప్పుడు అలాంటిదే ఈ సినిమాలో ఓ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో చరణ్-తారక్‌ల మధ్య ఓ భీకర యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

కథలో భాగంగా ఈ ఇద్దరు హీరోలు ఎదురుపడినప్పుడు వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్‌లో ఉండబోతుందని, ఈ ఫైట్ సీన్ ప్రేక్షకుల ఊహకందని విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

మరి దోస్తీకి కేరాఫ్‌గా ఉండబోయే ఈ రెండు పాత్రలు అసలు పొట్టుపొట్టుగా ఎందుకు కొట్టుకుంటారో తెలియాలంటే ఆర్ఆర్ఆర్ సినిమా చూడాల్సిందే.

రాజమౌళి సార్.దయచేసి ఈ సినిమాను త్వరగా రిలీజ్ చేయండి.

ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం.అని అంటున్నారు ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్.

ఆ రీజన్ వల్లే నాకు సౌత్ లో ఆఫర్లు తగ్గాయి.. ఇలియానా షాకింగ్ కామెంట్స్ వైరల్!