బాబు కే టెన్షన్ పుట్టిస్తున్న..ఇద్దరు మంత్రుల పోరు

తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకి మారు పేరు.చంద్రబాబు గీసిన గీటు దాటరు ఎవరూ.

 Fight Between Ap Ministers-TeluguStop.com

అంటూ అందరు అంటూనే ఉంటారు అయితే అదంతా గతం అంటున్నారు తెలుగుదేశంలో ఉన్న సీనియర్ లీడర్స్.అసలు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పై పట్టుని కోల్పోతున్నారా అనే సందేహం కూడా వస్తోంది అంటున్నారు.

క్రమశిక్షణ అనే మాటలు మీటింగ్స్ లో చెప్పుకోవడానికే తప్ప మరెందుకు పని చేయడం లేదు అంటున్నారు.ఇప్పటి తరం నేతలు అయితే అసలు చంద్రబాబు మాట అస్సలు వినడం లేదంట.

ఇక సీనియర్స్ అయితే చంద్రబాబు మాటని లెక్క పెట్టడం లేదని అంటున్నారు.అందుకే ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు టిడిపి పరువుని మీడియా పాలు చేస్తున్నారు.

అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాము అనేకదా సందేహం.అసలు విషయంలోకి వెళ్తే.


రోజు రోజుకి తెలుగుదేశం లో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైపోతున్నాయి…నేతల మధ్య ఎప్పటి నుంచో జరుగుతున్న గొడవలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ని రోడ్డుకి ఈడుస్తున్నాయి.విశాఖ జిల్లాలో ఏపీ మంత్రులు గంటా.అయ్యన్న మధ్య అధిపత్యపోరు ఏ రేంజ్ లో ఉందనేది వేరే చెప్పనవసరం లేదు.అందరికీ తెలిసిన విషయమే.అయితే వీరిద్దరి పుణ్యమా అని.పార్టీ ప్రతిష్ఠ రోజు రోజు కి రెడ్డిక్కి పోతోంది .అధినేత బాబు ఎన్నో సార్లు వీరిని మందలించినా సరే వీరిద్దరూ మాతం సై అంటే సై అంటూ కాళ్ళు దువ్వుతున్నారు.తాజాగా వీరిద్దరి మధ్య విభేదాలు మరోసారి రోడ్డు మీద పడ్డాయి.

నేను చెప్పింది చెయ్యండి లేకపోతే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అంటూ అయ్యన్న జిల్లా కలెక్టర్ కు 24 గంటల సమయం ఇచ్చాడు.ఇప్పుడు ఈ విషయం సంచలనం అయ్యింది.

గంటా అయ్యన్న మధ్య ఉన్న గొడవలతో ఉన్నత అధికారులు సైతం ఎన్నో ఇబ్బందుల పాలవుతున్నారు.ఇంతకీ ఏమయ్యిందంటే…ప్రతి జిల్లాలో డీఎల్ డీఏ కమిటీలు ఉంటాయి.

ఇంతకీ ఈ కమిటీలు ఏమిటంటే.పశు గణాభివృద్ధి సంస్థ.

ఇందులో కమిటీని అధికారపక్ష నేతలు డిసైడ్ చేస్తుంటారు.మిగిలిన జిల్లాల సంగతిని పక్కన పెడితే.

విశాఖ జిల్లాలో ఈ కమిటీ 2013లో నియమించారు.అంటే.

కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిపిన నియామకాన్ని టీడీపీ సర్కారు వచ్చినా మార్చలేదు.ఈ కమిటీ ఛైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాఘవేంద్రరావు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

మరో 15 మంది సభ్యులు ఉన్నారు.దీనికి ఛైర్మన్ గా మంత్రి గంటా వ్యవహరిస్తున్నారు.

ఇదిలాఉంటే కొన్ని కమిటీలు పదవీ కాలం పూర్తి అయిన వెంటనే రద్దు రద్దు అయ్యాయి.విశాఖ జిల్లా కమిటీ మాత్రం నేటికీ కొనసాగుతోంది.పదవీ కాలం ముగిసినా సరే వారు ఆ వ్యవహారాలలో కొనసాగుతున్నారు.ఈ విషయం తెలియని అధికారులు ఎన్నిక నిర్వహించాలంటూ కలెక్టర్ కు లేఖ రాశారు.

ఇదిలా ఉంటే.పశు సంవర్ధక శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి గత నెల 27న డీఎల్ డీఏ కమిటీకి 16 మంది సభ్యుల్ని నియమించారు.

దీనికి ఛైర్మన్ గా మంత్రి గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గానికి చెందిన గాడు వెంకటప్పడును ఎంపిక చేశారు.అయితే ఈ విషయంలోనే మంత్రి అయ్యన్న మండిపడుతున్నారు.

ఇన్ ఛార్జ్ మంత్రి చినరాజప్ప ముందు పంచాయితీ పెట్టారు.కమిటీలో మార్పులు సాయంత్రానికి పూర్తి కాకుంటే.

తన పదవికి రాజీనామా చేస్తానంటూ హెచ్చరిక చేశారు…చినరాజప్ప చొరవతో కలెక్టర్ కమిటీలు రద్దు చేశారు.దీంతో అయ్యన్న కూల్ అయ్యారు కానీ ఇప్పుడు గంటా ఈ విషయంపై ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో అర్థం కాక అధికారులు అందరు భయంతో వణికి పోతున్నారు.

మంత్రులు మంత్రులు కొట్టుకుని చివరికి అధికారులపై సాక్షాత్తు కలెక్టర్ కి వార్నింగ్ ఇవ్వండం ఎంతవరకూ సమంజసం అంటూ తిట్టిపోస్తున్నారు విశాఖ ప్రజలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube