తాజాగా లియో సినిమా నటుడు మన్సూర్ అలీ( Mansoor Ali ) ఖాన్ స్టార్ హీరోయిన్ త్రిషను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.రోజురోజుకీ ఈ వ్యవహారం మరింత ముదురుతూనే ఉంది.
ఇప్పటికే ఈ వ్యవహారంపై టాలీవుడ్,కోలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ త్రిషకు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.మన్సూర్ అలీ ఖాన్ పై సెలబ్రిటీలు సైతం మండిపడుతున్నారు.
ఇక టాలీవుడ్ నుంచి సింగర్ చిన్మయి అలాగే మంత్రి రోజా హీరో నితిన్ స్పందించిన విషయం తెలిసిందే.అలాగే మెగాస్టార్ చిరంజీవి సైతం స్పందిస్తూ మన్సూర్ వ్యాఖ్యలను ఖండిస్తూ త్రిషకు మద్దతుగా నిలిచారు.
అయితే చిరంజీవి త్రిష( Trisha )కు మద్దతుగా నిలవగా కోలీవుడ్ అభిమానులు మాత్రం ఊహించని విధంగా చిరంజీవిపై ట్రోల్స్ చేస్తున్నారు.కొన్ని సినిమా ఈవెంట్లలో హీరోయిన్లతో చిరు వ్యవహరించిన తీరును వాళ్లు తప్పుబడుతున్నారు.ఆచార్య సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్లో పూజా హెగ్డేతో, భోళా శంకర్ ప్రి రిలీజ్ ఈవెంట్లో( Bhola Shankar ) కీర్తి సురేష్‌తో చిరు కొంచెం సరదాగా రొమాంటిగ్గా వ్యవహరించారు.ఆ వేడుకలు చూసిన వాళ్లందరూ దాన్ని సరదాగానే తీసుకున్నారు.
కానీ ఇలాంటి సందర్భంలో మన్సూర్ వ్యాఖ్యలను చిరు ఖండిస్తే ఆ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ ఈ వీడియోలు పోస్ట్ చేసి ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు తమిళ నెటిజన్లు.
సరదాగా చేసిన దానికి మన్సూర్ చేసిన వ్యాఖ్యలకు ముడిపెడుతూ ట్రోల్స్ చేయడం అన్నది ఆశ్చర్యానికి గురి చేస్తోంది.కోలీవుడ్ లో కూడా చిరంజీవికి భారీగా అభిమానులు ఉన్నారు.హీరోయిన్ త్రిష కు కూడా చిరంజీవి అంటే అభిమానం ఉంది.
మరి చిరంజీవిపై జరుగుతున్న ట్రోల్స్ పై త్రిష ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.కాగా ఈ వార్తపై స్పందించిన చిరు అభిమానులు మరి ఇంత దిగజారాలా అంటూ తమిళ నెటిజన్స్ పై మండి పడుతున్నారు.