ఎన్టీఆర్ జిల్లాలో తారాస్థాయికి చేరిన రెండు కులాల మధ్య వైరం..

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ పాతపాడు గ్రామంలో పోలీస్ పహారా కాసారు.ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈనెల 3వ తారీకున విద్యార్థుల మధ్య ప్లేగ్రౌండ్ లో చెలరేగిన వివాదం.వారం రోజులు నుంచి పాతపాడులో ఖాకీలు గస్తీ కాయగా, వివాదంలో రెండు కులాల మధ్య వైర్యం తారాస్థాయికి చేరింది.

Feud Between Two Castes Reached Peak In NTR District..-ఎన్టీఆర్

గౌడ ,ఎస్సీ కులాల మధ్య గొడవ పెద్దల సెటిల్మెంట్ తేలని వివాదంపై నున్న పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఆరుగురు మధ్య గొడవ జరిగితే 20 మందిపై కేసు పెట్టారని ఎస్సీ వర్గం ఆవేదన వ్యక్తం చేశారు.అయితే పోలీసులు గొడవ జరిగి వారం రోజులైనా గొడవకు కారణమైన వ్యక్తులను ఇంతవరకు అరెస్ట్ చేయలేదని గ్రామస్తులు వెల్లడించారు.

జిల్లాకు చెందిన మంత్రి ఒక వర్గానికి సపోర్ట్ చేయడం న్యాయం కాదని ఎమ్మార్పీఎస్ నాయకుడు ఫైర్ అయ్యారు.రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన మంత్రి ఒక వర్గానికి సపోర్ట్ చేయటం చాలా దారుణం అంటున్న ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు విచారం వ్యక్తం చేశారు.

Advertisement

కులం, మతం చూడమన్న మంత్రులు తమ వరకు వచ్చే సరికి తమ వర్గానికి సపోర్ట్ చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆవేదన చెందారు.

హర్యానా బాలిక విషాద మృతి.. అమెరికాలో కన్నుమూసిన చిన్నారి!
Advertisement

తాజా వార్తలు