నైజీరియాలో విషాద ఘటన చోటు చేసుకుంది.అనంబ్రా రాష్ట్రంలోని ఒగబరు ప్రాంతంలో పడవ బోల్తా పడి 76 మంది ప్రాణాలు కోల్పోయారు.
నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో పడవ ప్రమాదవశాత్తూ మునిగిపోయింది.ప్రమాద సమయంలో పడవలో మొత్తం 85 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అత్యవసర సేవల సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.ప్రమాదం గురించి తెలుసుకున్న అధ్యక్షుడు బుహారీ బాధితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మరోవైపు నదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.







