ఈ కామర్స్ సమస్యలు పండగ సేల్స్ లో అదరగొడుతున్నాయి.దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లతోపాటు ఇతర ఈ కామర్స్ బ్రాండ్లు కూడా బంపర్ సెల్స్ ను నమోదు చేస్తున్నాయి.
ముఖ్యంగా రెండు,మూడు విడత పట్టణాల్లో అమ్మకాల్లో గణనీయ వృద్ధి ఆయా కంపెనీల్లో జోష్ పెంచింది.ఫ్యాషన్ ఈ- కామర్స్ దిగ్గజం మింత్రా బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ సేల్ మొదటిరోజు అక్టోబర్ 3న రికార్డు స్థాయిలో 19 మిలియన్ల మంది విజిటర్స్ నమోదు కాగా తొలి గంటలోనే ఆరు లక్షల ఐటమ్స్ కొనుగోలు చేశారు.
మొదటి రోజు మొత్తం నాలుగు4 మిలియన్స్ ఐటమ్స్ కొనుగోలు చేశారని మింత్రా తెలిపింది.ఇందులో 40 శాతం ఆర్డర్లు రెండు, మూడు దశ నగరాలు, అంతకు తక్కువ స్థాయి నుంచే వచ్చాయని మింత్రా పేర్కొంది.
కొత్త కస్టమర్ల భాగస్వామ్యం 2,3వ స్థాయి నగరాల నుంచి ఎక్కువగా ఉందని మింత్రా సీఈవో అమర్ నాగామ్ అన్నారు.
ఫ్లిప్ కార్ట్ గ్రూపునకు చెందిన మింత్రా దేశంలో 5వేలకు పైగా ప్రధాన ఫ్యాషన్ లైఫ్ స్టైల్ బ్రాండ్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఇక రిలయన్స్ గ్రూప్ కు చెందిన ఆన్ లైన్ ఫ్యాషన్ ఈ- టైలర్ అజియో.సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 4 వరకు ఫెస్టివల్ సెల్ ‘బిగ్ బోల్డ్ సేల్’ నిర్వహించింది.దేశ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చినట్టు అజియో వెల్లడించింది.ఇక లగ్జరీ లైఫ్ స్టైల్ ఫ్లాట్ ఫాం టాటా కి క్యూ లగ్జరీ అక్టోబరు 6-10 మధ్య “10 ఆన్ 10” సేల్ నిర్వహిస్తుంది.
కేటగిరీల వారీగా లగ్జరీ బ్రాండ్లను ఆకర్షణీయమైన డిస్కౌంట్లుకు ఆఫర్ చేస్తుంది.

2021 పండగ సీజన్ లో భారత్ లో ఆన్లైన్ రిటైలర్స్ 9.2 మిలియన్ డాలర్ల మేరకు కొనుగోలు జరిగే అవకాశం ఉందని గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఫార్రెస్టర్ అంచనా వేసింది.ఏడాది ప్రతిపాదన 42 శాతం వృద్ధి నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.గతేడాది 2020 పండుగ సీజన్లో విక్రయాలు మొత్తం 6.5 మిలియన్ డాలర్లుగా ఉందని గుర్తు చేసింది.అక్టోబర్ మొదటి వారం (3-10) ఆన్లైన్ విక్రయాలు విలువ 6.4 మిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని ఫార్రెస్టర్ సీనియర్ ఫోర్కాస్ట్ అనలిస్ట్ జితేందర్ మిగ్లానీ అంచనా వేశారు.