గుడ్ న్యూస్: త్వరలోనే కరోనాకు ఇంజక్షన్!

దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది.ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.

 Favipiravir Injection Will Availble In Market Within Few Days, Favipiravir Table-TeluguStop.com

కరోనా వైరస్ విజృంభించిన తొలినాళ్లకు, ఇప్పటికీ వైద్య రంగంలో అనేక మార్పులొచ్చాయి.ఇప్పటికే కరోనాకు అనేక మందులు అందుబాటులోకి వచ్చాయి.

తక్కువ స్థాయి నుంచి మధ్య స్థాయి కరోనా లక్షణాలు ఉన్నవాళ్లకు వేరువేరు పేర్లతో అందుబాటులో ఉన్న ఫావిపిరవిర్ ఔషధాన్ని వైద్యులు సూచిస్తున్నారు.

అయితే ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లు వాడే విషయంలో ఒక విచిత్రమైన సమస్య ఉంది.

బాధితులు ఎక్కువ సంఖ్యలో ప్రతిరోజూ ఈ ట్యాబ్లెట్లను తీసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం 200 ఎంజీతో తయారు చేసిన ట్యాబ్లెట్లు మార్కెట్లో అందుబాటులో ఉండగా 400 ఎంజీ ట్యాబ్లెట్లను తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయితే కొన్ని ఫార్మా కంపెనీలు ఫావిపిరవిర్ ఇంజక్షన్ ను తయారు చేయడం ద్వారా ఈ సమస్యలన్నింటికీ సులభంగా చెక్ పెట్టవచ్చని భావిస్తున్నాయి.

హైదరాబాద్ కు చెందిన ఒక ప్రముఖ కంపెనీ త్వరలో కరోనాకు ఫావిపిరవిర్ ఇంజక్షన్ ను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ఫావిపిరవిర్ ను ప్రధానంగా ఇన్ ఫ్లూయెంజాతో బాధ పడే వారి కోసం వినియోగించడం జరుగుతుంది.కరోనా రోగుల విషయంలో ఈ ఔషధం మంచి ఫలితాలు ఇవ్వడంతో వైద్యులు వారికి ఈ ఔషధాన్ని ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నారు.

త్వరలో కరోనాకు ఫావిపిరవిర్ ఇంజక్షన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఫావిపిరవిర్ ట్యాబ్లెట్ ధర తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.కరోనా ట్యాబ్లెట్ ధరలు తగ్గితే వైరస్ బారిన పడిన బాధితులకు ప్రయోజనం చేకూరుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube