తండ్రి ఆత్మహత్యకు అడ్డుగా కూతురు.. ఆ తండ్రి ఏం చేశాడంటే..?

తండ్రి( Father ) ఆత్మహత్య ప్రయత్నం లో 8 ఏళ్ల కూతురు అడ్డుపడి తండ్రి ప్రాణాలను కాపాడడమే ఆమె పాలిట శాపంగా మారింది.తండ్రి ప్రాణాలను కాపాడాలనుకుంటే ఏకంగా తనప్రాణాలే గాలిలో కలిసిపోయాయి.

 Father Takes Life Of Daughter In Jammu Kashmir Details, Father , Daughter ,jammu-TeluguStop.com

క్షణికావేశంలో కడుపున పుట్టిన కూతురినే కాటికి పంపించాడు ఆ తండ్రి.దీనికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

జమ్ము కాశ్మీర్ లోని( Jammu Kashmir ) కుప్వరా జిల్లాలోని కుర్హమ గ్రామంలో జరిగిన సంఘటన స్థానికంగా అందరిని కలచివేసింది.ఇక్బాల్ (45)( Iqbal ) అనే వ్యక్తి డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అయితే ఇక్బాల్ తన భార్యతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు.తాజాగా బుధవారం భార్యాభర్తల మధ్య గొడవ మొదలై.

మాటల యుద్ధం జరిగింది.

దీంతో కోపంతో రగిలిపోతున్న ఇక్బాల్ ఆత్మహత్య చేసుకుంటానని తన వాహనం వద్దకు వెళ్లాడు.

తన ఎనిమిదేళ్ల కూతురు, తండ్రి వెనకాలే వాహనం వద్దకు వచ్చి తండ్రిని ఆపే ప్రయత్నం చేసింది.తండ్రి వినకపోవడంతో అదే వాహనంలో ఎక్కింది.ఇంటికి తిరిగి వెళ్లాలని కూతురు తండ్రిని ఎంత నచ్చచెప్పినా తండ్రి ఒప్పుకోలేదు.పైగా కూతురిని వాహనంలో నుండి దిగి వెళ్లిపోవాలని పలుమార్లు సూచించాడు.

కూతురికి పది రూపాయలు ఇచ్చి ఏమన్నా కొనుక్కుని ఇంటికి వెళ్లాలని చెప్పిన కూతురు వినకపోవడంతో, తన ఆత్మహత్యకు అడ్డుగా ఉన్న కూతురి గొంతును నులమడంతో బాలిక చనిపోయింది.వెంటనే బాలిక శవాన్ని పక్కనే ఉన్న స్టోరేజ్ షెడ్డు వద్ద పారేసి, ఆత్మహత్య ప్రయత్నం మానుకొని కాసేపటి తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళాడు.ఒంటరిగా ఇంటికి వెళ్లిన ఇక్బాల్ ను అమ్మాయి ఎక్కడ అని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.

తనతో పాటు రాలేదని ఇక్బాల్ చెప్పాడు.ఇక్బాల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేసి ఇంటికి వచ్చేలోపల కుటుంబ సభ్యులు బాలిక మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు.కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఇక్బాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube