సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా పూజా హెగ్డే, శ్రీలీల( Pooja Hegde, Srileela ) హీరోయిన్ లుగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas )దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”SSMB28”.ఇప్పటికే వీరి కాంబోలో అతడు, ఖలేజా వంటి రెండు డిఫరెంట్ మూవీస్ వచ్చాయి.ఇక ఇప్పుడు మూడవ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి ఏదొక అప్డేట్ వస్తూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.
తాజాగా వచ్చిన వార్త ప్రకారం ఈ సినిమాలో స్టార్ కమెడియన్ కీలక పాత్ర చేస్తున్నట్టు సమాచారం.మరి ఆ స్టార్ కమెడియన్ ఎవరో కాదు.

టాలీవుడ్ లో తన కామెడీ టైమింగ్ తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించిన స్టార్ కమెడియన్ సునీల్( Sunil ).ఈయన ఒకప్పుడు తీరిక లేకుండా సినిమాలు చేసేవాడు.కానీ మధ్యలో కామెడీ పాత్రలకు గుడ్ బై చెప్పి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించు కోవాలని అనుకున్నాడు.అయితే హీరోగా అన్ని ప్లాప్స్ వస్తున్నా నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో కీలక రోల్స్ చేస్తున్నాడు.

పుష్ప సినిమాలో విలన్ గా ఆకట్టుకున్న సునీల్ ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో కీలక రోల్ చేయబోతున్నాడు అని తెలుస్తుంది.ఈ సినిమాలో ఈయనది ఫుల్ లెంగ్త్ కానప్పటికీ కీలక పాత్ర అని తెలుస్తుంది.మరి ఈ సినిమా ద్వారా సునీల్ ఎలా ఆకట్టు కుంటాడో వేచి చూడాల్సిందే.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది.







