నేడు సిపిఎం ఆధ్వర్యంలో 18 సెంటర్లలో నిరాహార దీక్షలు

ఖమ్మం నియోజకవర్గం లోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం 18 సెంటర్లు ఒక్కరోజు నిరాహార దీక్షలను నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ తెలిపారు.ఆదివారం ఖమ్మం సుందరయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ 57 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారని, రెండోసారి అధికారులకు వచ్చాక పెన్షన్స్ ఇస్తానని చెప్ప, సిపిఎం పోరాటాల ఫలితంగా పెన్షన్స్ ఇస్తున్నారన హామీ ఇచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్న అర్హులకు కాకుండా అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగా పెన్షన్స్ ఇస్తున్నారని ఇప్పటికైనా వారు స్పందించి అర్హతలు ఉన్న 57 సంవత్సరాలు నిండిన అర్హులకు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలని, అదేవిధంగా పెండింగ్ లో ఉన్న పింఛన్లు అన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 Fasting In 18 Centers Under Cpm Today ,cpm, Khammam, Battina Upender-TeluguStop.com

అదేవిధంగా సొంత జాగా ఉన్నవారికి మూడు లక్షల ఇస్తామని సీఎం చెప్తున్నారని, సొంత స్థలమున ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అదేవిధంగా అర్హులైన వారందరిికీ డబల్ బెడ్ రూములుు ఇవ్వాలని, డబల్ బెడ్ రూమ్ ఇవ్వని యేడల ఇల స్థలాలు ఇవ్వాలనిిి డిమాండ్ చేశారు.పాత ఎన్నికల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని హామీ ఇచ్చారని, డబల్ బెడ్ రూములు ఇవ్వావి యేడల ఖమ్మంలో అధికారుల సేకరించిన భూము లో పేదల అందరికీీ ఇండ్ల స్థలాలు డిమాండ్ చేశారు.

పెన్షన్ దార్లకు ఏ డివిజన్ పరిధిలోని అ డివిజన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి కెసిఆర్ గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రతి సంవత్సరం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 100 కోట్లు కేటాయిస్తాం చెప్పారని ఇప్పటివరకు ఎన్ని కోట్లు కేటాయించారని తెలపాలని డిమాండ్ చేశారు.

ఈ సమస్యలపై ఖమ్మం నియోజకవర్గం లోని 18 సెంటర్లో ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆఫోజ్ సమీనమాట్లాడుతూ నగరంలోని మిషన్ భగీరథ పైపులు లీకేజీ కారణంగా తాగునీరు కలుషితమై ప్రజలు వ్యాధులు పారిన పడుతున్నారని, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మిషన్ భగీరథ పైపులకు మరమ్మత్తులు నిర్వహించి, గుంతలు పూడ్చి చాలని డిమాండ్ చేశారు.

పైపులు నీకు ఏదైనా తీసిన గుంతల్లో వాహనదారులు పాదచారులకు జరుగుతున్నాయని వెంటనే మరమ్మత్తులు చేసి ప్రజలకు తాగు నిర్మించాలని డిమాండ్ చేశారు.ఈ విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వై.విక్రమ్, జిల్లా కమిటీ సభ్యులు ఎర్రా శ్రీనివాసరావు, దొంగల తిరుపతి రావు, త్రీ టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీను , ఖమ్మం అర్బన్ కార్యదర్శి బత్తిన ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube