ఏపీ సీఎం జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ లేఖ రాశారు.రాష్ట్రంలోని రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
నీరు లేక ఎండిపోయిన పంటలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు.ఎండిపోయిన పంటలను రైతులు తగలబెడుతుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని వెల్లడించారు.
గత వందేళల్లో ఇలాంటి కరువు పరిస్థితులు లేవన్న లోకేశ్ తొలిసారి రాష్ట్రంలో అతి తక్కువ వర్షపాతం నమోదు అయిందన్నారు.రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే మూడవ స్థానంలో ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్న లోకేశ్ యుద్ధ ప్రాతిపదికన కరువు మండలాలని గుర్తించి కేంద్రానికి నివేదిక పంపాలన్నారు.వ్యవసాయ రుణాలు రద్దు చేయాలని కోరారు.
అదేవిధంగా పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.