క్యూ లైన్ లో రైతులు .. మండిపడ్డ బీఆర్ఎస్ 

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్( Congress ) ను టార్గెట్ చేసుకుని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఏదో ఒక అంశంతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది .

కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీ విషయంలో ఇప్పటికే నిలదీస్తూ అనేక విమర్శలు చేస్తూ,  ప్రజలలో కాంగ్రెస్ పరువు తీసే ప్రయత్నం చేస్తుంది .

గత బీఆర్ఎస్ పాలనలోనే రైతులు,  ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని,  కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుందని పదేపదే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు.ఇటీవల తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని , మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ కి వస్తాయని,  కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం అవుతుందని పదేపదే విమర్శలు చేస్తున్నారు.

Farmers In The Queue Line Angry Brs, Brs Party, Brs Social Media, Congress, Tel

తాజాగా విత్తనాల కోసం భూమి పాస్ పుస్తకాలతో( Pass books ) రైతులు క్యూ లో నిలబడడంపై బీఆర్ఎస్( BRS party ) సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పై విమర్శలు చేసింది.  ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు అంటూ ప్రశ్నిస్తూ తీవ్ర విమర్శలు చేసింది.ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను బీఆర్ఎస్ పార్టీ తరఫున పోస్ట్ చేశారు.

  ఈ వీడియోలో రైతులు ఆగ్రో సేవా కేంద్రం ముందు పట్టా పాస్ పుస్తకాలకు సంబంధించిన జిరాక్స్ ను క్యూ లైన్ లో పెట్టారు.దీనిపై రైతులు మాట్లాడుతూ జీలుగు విత్తనాల కోసం ఎన్నడూ కూడా లైన్ లో నిలబడలేదని,  జిలుగు విత్తనాలు ఇవ్వడానికి ఏ ఈ ఓ సంతకాన్ని అడుగుతున్నారని రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.

Farmers In The Queue Line Angry Brs, Brs Party, Brs Social Media, Congress, Tel
Advertisement
Farmers In The Queue Line Angry BRS, Brs Party, Brs Social Media, Congress, Tel

మొన్నటి వరకు పండించిన ఓట్లు కొనలేదని బాధపడ్డాం,  ఇప్పుడు విత్తనాల కోసం అరిగోసలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు అంటూ బీఆర్ ఎస్ ప్రశ్నిస్తోంది.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం దగ్గర ఉదయం 6 నుంచి జీలుగు విత్తనాల కోసం పాస్ బుక్ లతో రైతులు క్యూ కట్టారని, గత పదేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా రైతులను ఎండలో రోడ్లమీద నిలబెట్టి అసమర్థ కాంగ్రెస్ మంత్రులు చోద్యం చూస్తున్నారని, అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అంటూ బీఆర్ఎస్ టెక్ సెల్ పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు