ఆ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్న కేజిఎఫ్ అభిమానులు..!

కేజిఎఫ్ సినిమాతో యష్ ఒక్కసారిగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమాతో యష్ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు.

 Fans Worried About Kgf Chapter 2 Release Date, Yash, Kgf Chapter 2, Release Date-TeluguStop.com

ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందిన సినిమా కేజీఎఫ్.కెజిఎఫ్ హిట్ అవ్వడంతో ప్రశాంత్ నీల్ పేరు, యష్ పేరు ఇప్పుడు ప్రపంచం అంతా వినిపిస్తున్నాయి.

అంత పెద్ద హిట్ అవ్వడంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చాప్టర్ 2 కూడా తెరకెక్కిస్తున్నాడు.

సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ స్టార్లు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో రాఖీ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యష్ ఇప్పుడు కెజిఎఫ్ 2 తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు.నిర్మాతలు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

కేజిఎఫ్ హిట్ తో యష్ ఒక్కసారిగా మార్కెట్ పెంచుకున్నాడు.

Telugu Covid Effect, Fansworried, Kgf Chapter, Kgf, Prashanth Neel, Yash-Movie

ఈ సినిమాలో రాఖీ బాయ్ లవర్ గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు.ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.ఈ సినిమా కోసం దెస వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు అంటేనే అర్ధం అవుతుంది యష్ కు ఎంత మంది అభిమానులు ఉన్నారో అని.ఈ సినిమా నుండి విడుదల అయినా పోస్టర్స్, టీజర్ అన్ని భారీ రెస్పాన్స్ అందుకున్నాయి.

ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయిన కెజిఎఫ్ సినిమా దాదాపు 250 కోట్లు కొల్లగొట్టి కన్నడ సినిమాల్లో భారీ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇప్పుడు కెజిఎఫ్ చాప్టర్ 2 ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

అయితే ఈ సినిమా విడుదల విషయంలో అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు.

జులై 16న విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.తర్వాత ఆర్ ఆర్ ఆర్ స్థానంలో విడుదల కాబోతుందని టాక్ వినిపించింది.

తాజాగా మరొక డేట్ వినిపిస్తుంది.అక్టోబర్ 15 న ఈ సినిమా రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తుందని మళ్ళీ టాక్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube